మారుతి సుజుకి డెక్కన్ ర్యాలీ: పూనే నుండి గోవాకు
మారుతి సుజుకి పూనేలో రెండవ నేషనల్ సూపర్ లీగ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ 2016ను ప్రారంభించింది. ఈ ఈవెంట్‌ను ముఖ్యంగా మోటార్ స్పోర్ట్స్ పరంగా ఆసక్తిని కనబరిచే యువత మరియు ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది.

ఈ ఏడాదిలో మొత్తం 35 జట్లు పాల్గొన్నాయి, అందులో కేవలం ఐదు మాత్రమే మహిళా జట్లు పొల్గొన్నాయి. ఈ ఐదు జట్లలో మొత్తం 11 మంది మహిళలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనే వాహనాలన్నింటిని కూడా అన్ని విధాలుగా నిపుణుల సమక్షంలో పరీక్షించిన తరువాత వీరిని ర్యాలీకి అనుమతించారు.
Also Read: ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు
మారుతి సుజుకి నిర్వహించిన ఈ డెక్కన్ ర్యాలీ పూనే నుండి గోవా వరకు సుమారుగా 700 కిలోమీటర్ల పాటు జరిగింది. ర్యాలీలో ఉద్యోగస్థులు మాత్రమే కాకుండా కొంత మంది ప్రత్యేక డ్రైవర్లు జగ్‌మీత్ గిల్, సచిన్ సింగ్ మరియు ఎస్‌కె అజ్గర్ అలీ వంటి వారు పాల్గొన్నారు.
Also Read: భూమ్మీద వీటిని మించిన వేగంతో వెళ్లగలరా...?
మారుతి సుజుకి డెక్కన్ ర్యాలీ కేవలం నాలుగు చక్రాల డ్రైవర్లకు మాత్రమే నిర్వహించారు మరియు వీరిని నాలుగు గ్రూపులుగా విభజించారు. అందులో నాన్-ఛాంపియన్‌షిప్ - ఎక్స్‌పర్ట్, నాన్-ఛాంపియన్‌షిప్- అమేచర్, డెనజెన్- ఎక్స్‌పర్ట్ మరియు డెనిజెన్ - అమేచర్ వంటి గ్రూపులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications