ఎనిమిది కార్ల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించిన మారుతి సుజుకి
ఇండియాలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మరియు అతి ఉత్తమమైన అమ్మకాలు సాధింస్తున్న ఏకైక కార్ల సంస్థ మారుతి సుజుకి. మరే ఇతర తయారీదారులకు సాధపడనంతగా భారీ అమ్మకాలు సాధిస్తోంది. అయినప్పటికీ తమకు పోటీగా నిలిచిన వారి పతనం కోసం అన్నట్లుగా తమ ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.
దేశీయంగా మరిన్ని అమ్మకాలను రాబట్టుకునేందుకు మారుతి జూలై 2016 గాను తమ ఎనిమిది ఉత్పత్తుల మీద ఆఫర్లను ప్రకటించింది వాటి గురించి క్రింది కథనంలో....

ఆల్టో800
మారుతి సుజుకి తమ ఆల్టో800 మీద 15,000 రుపాయల విలువైన క్యాష్ డిస్కౌంట్లను ప్రకటించింది. మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ క్రింద 20,000 రుపాయలను డిస్కౌంటుగా అందిస్తారు.

ఆల్టో కె10
మారుతి సుజుకి ఆల్టో800 కు పై స్థానంలో విడుదల చేసిన ఉత్పత్తి ఆల్టో కె10. దీని మీద కూడా మారుతి 15,000 రుపాయల క్యాష్ డిస్కౌంట్ మరియు 20,000 రుపాయలను ఎక్స్‌చ్చేంజి బోనస్‌గా అందిస్తారు.

మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి వారి సెలెరియోలో ఉన్న డీజల్ మరియు పెట్రోల్ రెండు వేరియంట్ల మీద వరుసగా 10,000 మరియు 25,000 రుపాయల విలువైన క్యాష్ డిస్కౌంట్లు కలవు. అదే విధంగా రెండు వేరియంట్ల మీద 20,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
మారుతి వారి వ్యాగన్ ఆర్ లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద 25,000 రుపాయల విలువైన క్యాష్ డిస్కౌంట్లు మరియు 35,000 రుపాయలను ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌గా అందింస్తారు.

వ్యాగన్ ఆర్ సిఎన్‌జి
వ్యాగన్ ఆర్ లోని సిఎన్‌జి వేరియంట్ల మీద 35,000 రుపాయలను ఎక్స్‌చ్చేండ్ బోనస్‌గా మరియు 20,000 రుపాయలను క్యాష్ డిస్కౌంట్లుగా అందింస్తారు.

మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి వారి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు మీద 10,000 రుపాయలను క్యాష్ డిస్కౌంట్లుగా అదే విధంగా 15,000 రుపాయలను ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌గా ప్రకటించారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
మారుతి సుజుకి వారి బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ మీద 10,000 రుపాయల క్యాష్ డిస్కౌంట్ మరియు 15,000 రుపాయల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌ను అందించారు.

మారుతి సుజుకి సియాజ్
మారుతి వారి సియాజ్ పెట్రోల్ వేరియంట్ 15,000 రుపాయల క్యాష్ డిస్కౌంట్ కలదు. మరియు సియాజ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్ల మీద 30,000 రుపాయల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌ను ప్రకటించారు.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి వారి ఎర్టిగా ఎమ్‌పివి మీద 20,000 రుపాయల విలువైన లాభాలను అందించారు. అదే విధంగా ఎర్టిగాలోని కేవలం డీజల్ వేరియంట్ మీద 15,000 రుపాయలను ఎక్స్‌చ్ఛేంజ్‌ను ప్రకటించారు.

మారుతి ప్రకటించిన మొత్తం ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న మారుతి డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి మరియు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్థాయి. అన్ని ఆఫర్లు కూడా జూలై 2016 కు మాత్రమే ఉన్నాయి.

- ఇదే పరిస్థితి కొనసాగితే, ఆల్టో కథ కంచికే...!!


Click it and Unblock the Notifications