డిజైర్ టూర్ కార్ల అమ్మకాలకు బ్రేక్ వేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో తమ బెస్ట్ సెల్లింగ్ డిజైర్ టూర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలకు బ్రేక్ వేసింది. ఇక మీద మార్చి 2017 నుండి డిజైర్ కార్ల ను కొనుగోలు చేయలేరు.
భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ టూర్ అమ్మకాలను నిలిపివేయనుంది. మార్చి 2017 నుండి దేశీయ విపణిలో వీటి అమ్మకాలకు బ్రేక్ వేయనున్నట్లు సమాచారం.

సమాచార వర్గాల కథనం మేరకు 2017 లో తమ డిజైర్ వేరియంట్‌ను అప్‌డేటెడ్ వేరియంట్లో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అదే సమయం నుండి డిజైర్ టూర్ ఎడిషన్ ను విపణిలో అమ్మకాలకు దూరం చేయనుంది.

డిజైర్ టూర్ కాంపాక్ట్ సెడాన్‌ను ఇక మీదట ఇవ్వబోమని ఇప్పటికే తమ సప్లయర్స్ కు మారుతి సుజుకి స్పష్టం చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న మారుతి ప్రస్తుతం ఉన్న డిజైర్ టూర్ ఎడిషన్ స్థానంలోకి నెక్ట్స్ జనరేషన్ డిజైర్‌ను ప్రవేశపెట్టనుంది. భారీ సంఖ్యలో కాకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునేందుకు లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేయనుంది.

మారుతికి ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు తెచ్చిపెడుతున్న వాటిలో డిజైర్ ఒకటి. సగటున నెలకు 2,500 నుండి 3,000 యూనిట్ల వరకు అమ్ముడుపోతుంటాయి. గడిచిన నవంబర్‌లో 3,017 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

మారుతి సుజుకి ఈ మధ్యనే దేశీయంగా తమ లైనప్‌లో రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే విక్రయాల్లో వృద్ది సాధించలేని ఉత్పత్తులను పూర్తిగా తుడిచేసి భారీ సంఖ్యలో విరివగా అమ్ముడయ్యే ఉత్పత్తుల మీద శ్రద్ద పెడుతోందని మార్కెట్ వర్గాలు ఉంటున్నాయి.

తరువాత తరం కోసం తెర వెనుక డాసియా డస్టర్
తరువాత తరం కోసం యూరోపియన్ కార్ల తయారీ సంస్థ డాసియా నూతన 2017 డస్టర్ ను అభివృద్ది చేస్తోంది. వచ్చే ఏడాది దీనిని ప్రపంచ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు
టీవీఎస్ వీగో గురించి మరియు కొచ్చిన నగర విశేషాలతో పాటు క్రిస్మస్ వేడుకల అనుభవాలు....


Click it and Unblock the Notifications








