మారుతి సుజుకి కార్లు కావాలంటే రూ. 34,494 లు అధికంగా చెల్లించాల్సిందే
ఇండియన్ మార్కెట్లో అన్ని సెగ్మెంట్లలో కూడా కార్లను అమ్ముతున్న మారుతి సుజుకి తమ అన్ని రకాల కార్ల మీద కూడా ధరల పెంపును ప్రకటించింది. ఈ సందర్బంగా తమ అన్ని కార్ల మీద దాదాపుగా 34,494 రుపాయల వరకు పెంచినట్లు తెలిపింది.
Also Read: 100,000 లు దాటిన మారుతి సుజుకి బాలెనొ బుకింగ్స్
మారుతి సుజుకి వారి ధరల పెంపు వెనుక గల ఆంతర్యం మరియు ఇతర వివరాలు గురించి క్రింది కథనంలో ఇవ్వబడ్డాయి.

మారుతి సుజుకి అన్ని మోడళ్ల మీద ధరలను పెంచినప్పటికీ రెండు కార్ల మీద తమ ధరల పెంపు నుండి మినహాయించింది. అందులో హైబ్రిడ్ సియాజ్ ఎస్‌హెచ్‌విసి మరియు హైబ్రిడ్ ఎర్టిగా ఎస్‌హెచ్‌విసిలు ఉన్నాయి.

అయితే మారుతి సుజుకి ఇలా ధరలను పెంచడానికి గల ముఖ్య కారణం 2016-2017 యూనియన్ బడ్జెట్‌లో భారతీయ ప్రభుత్వం కార్ల తయారీ మీద పెంచిన పన్నులు అని స్పష్టంగా తెలుస్తోంది.

అయితే మారుతి రెండు మోడళ్ల మీద ధరలను పెంచకపోవడానికి కూడా కారణం ఉంది. భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారం హైబ్రిడ్ మరియు స్మార్ట్ హైబ్రిడ్ వాహనాల తయారీ మీద ట్యాక్స్‌ను పెంచలేదు. అందుకోసం ధరల పెంపునకు హైబ్రిడ్ వాహనాలు దూరంగా ఉన్నాయి.

మారుతి సుజుకి తమ ఫోర్ట్ ఫోలియోలో ఉన్న అన్ని కార్ల మీద ప్రస్తుతం గల ఎక్స్ షోరూమ్‌ల ధరలతో పాటు 1,441 నుండి 34,494 వరకు మోడల్‌ను బట్టి పెంపు ఉంటుందని తెలిపారు.

భారతీయ మార్కెట్లో అత్యధికంగా తయారీ మరియు అమ్మకాలు చేపడుతున్న మారుతి సుజుకి ఈ ఏడాదిలో కొన్ని కొత్త ఉత్పత్తులు తీసుకు వస్తోంది. అందులో ఒకటి వితారా బ్రిజా క్రితం రోజున మార్కెట్లోకి విడుదల కాగా మరొకటి ఇగ్నిస్ క్రాసోవర్ ఈ ఏడాది లోపు విడుదల కానుంది.

యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకున్న తయారీ రంగం మీద ట్యాక్స్ పెంపు నిర్ణయం ప్రకారం ఇతర ఆటోమొబైల్ సంస్థలు అయిన మెర్సిడెస్ బెంజ్, హ్యుందాయ్, నిస్సాన్ మరియు హోండా వంటి సంస్థలు తమ కార్ల యొక్క ఎక్స్ షోరూమ్ ధరలను పెంచింది.

- వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు: మరిన్ని వివరాలు కోసం
- మాల్యా జీవితంలోకి శని దేవుడి రంగ ప్రవేశం: ఒక్కొక్క ఆస్తి కోల్పోతున్న మాల్యా


Click it and Unblock the Notifications