క్రాష్ పరీక్షల్లో భళా అనిపించుకున్న ఇగ్నిస్ !!
మారుతి సుజుకి అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న తమ మిని ఎస్‌యువి ఇగ్నిస్‌కు Euro NCAP వారి ఆధ్వర్యంలో క్రాష్ పరీక్షలు నిర్వహించింది. అందులో ఐదు కు ఐదు స్టార్ల ర్యాంకింగ్ లభించింది.
మారుతి సుజుకి అప్ కమింగ్ కారు ఇగ్నిస్ గురించి, దాని విడుదలకు సంభందించిన వార్తలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. కదా, అయితే గ్లోబల్ ఎన్‌సిఎపి మారుతి వారి అప్ కమింగ్ మిని ఎస్‌యువికి భద్రత పరీక్షలు నిర్వహించింది. ఇగ్నిస్‌లోని స్టాండర్డ్ మరియు భద్రత ఫీచర్లతో నిండిన వేరియంట్లకు నిర్వహించిన ఢీ పరీక్షల్లో ఐదుకు గాను మూడు స్టార్ల సేఫ్టీ ర్యాంకింగ్ వచ్చింది. ఇంకేముంది భద్రత పరీక్షల్లో మంచి ర్యాంక్‌తో నెగ్గిన ఇగ్నిస్ భారీ విక్రయాల బాటపట్టనుందని మారుతి భావిస్తోంది.

భద్రత పరంగా అత్యుత్తమమైన కారుగా నిరూపించుకునే మొదటి అవకాశం క్రాష్ పరీక్షల్లో నెగ్గడం. క్రాష్ పరీక్షల్లో మంచి రేటింగ్ సాధించాయా ఇక వాటి అమ్మకాలకు ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే కాబోలు మారుతి తమ ఇగ్నిస్ మిని ఎస్‌యువికి యురోపియన్ న్యూ కార్ అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) వారిచే క్రాష్ పరీక్షలు నిర్వహించింది.

ఇగ్నిస్ స్టాండర్డ్ మరియు భద్రత పీచర్ల ఇగ్నిస్ అంటూ రెండు వేరియంట్లకు ఎన్‌సిఎపి వారి ఆధ్వర్యంలో క్రాష్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఐదుకు గాను స్టాండర్డ్ వేరియంట్ ఇగ్నిస్ మూడు స్టార్లు మరియు భద్రత ఫీచర్లున్న ఇగ్నిస్ ఐదు స్టార్ల రేటింగ్ పొందాయి.

స్టాండర్డ్ వేరియంట్ పెద్దలు మరియు చిన్న పిల్లల భద్రత పరంగా 79 శాతం మరియు సేఫ్టీ ఫీచర్లతో నిండిన ఇగ్నిస్ పెద్దల భద్రత పరంగా 89 శాతం అదే విధంగా చిన్న పిల్లల భద్రత పరంగా 79 సేఫ్ అని తేలింది.

ఇగ్నిస్ స్టాండర్డ్ మరియు సేఫ్టీ ఫీచర్లున్న వేరియంట్లకు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో వేరియంట్ల వారీగా ర్యాంకింగ్.
Euro NCAP మారుతి సుజుకి ఇగ్నిస్‌కు జరిపిన క్రాష్ పరీక్షలను వీడియో ద్వారా తిలకించగలరు.

- మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?
- ఇండియన్ ఇగ్నిస్ లో హైబ్రిడ్ టెక్నాలజీ
- ఇగ్నిస్ ను విడుదల కంటే ముందుగా డెలివరీ ఇవ్వనున్న సుజుకి


Click it and Unblock the Notifications








