విభిన్న శైలిలో సుజుకి ఇగ్నిస్: విడుదల కంటే ముందుగా డెలివరీ
మారుతి సుజుకి తమ ఇగ్నిస్ స్టాండర్డ్ వేరియంట్‌ను అధికారికంగా విడుదల(జనవరి 2017 లో) చేయడానికి ముందే సుజుకి 100 విభిన్నమైన iUNIQUE ఇగ్నిస్ కార్లను డెలివరీ ఇవ్వడానికి సిద్దమైంది.
మారుతి సుజుకి నుండి ఏ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చినా ఖచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుంది. ఏ కొత్త కారు విడుదలైనా భారతీయులు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో స్వీకరిస్తున్నారు. మారుతి నుండి ఇప్పుడు మరో కారు (ఇగ్నిస్) విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఇండియాలో విడుదల కన్నా ముందుగా కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఇగ్నిస్ అమ్మకాలు సిద్దమవుతోంది.

జపాన్ ఆధారిత, దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ సరికొత్త ఇగ్నిస్ క్రాసోవర్ కారును విడుదల కంటే ముందే iUNIQUE అనే లిమిటెడ్ ఎడిషన్ పేరుతో డెలివరీకి ఏర్పాట్లు చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇగ్నిస్‌కు సంభందించిన సమాచారం కోసం ఔత్సాహికులు నెట్టింట్లో కర్సర్ పెట్టి వెతుకుతూనే ఉన్నారు. ఆ వేటలోనే మారుతి విడుదల కంటే ముందు డెలివరీ అనే బాగోతం బయటకొచ్చింది.

ఇటలీ మార్కెట్లో మారుతి ఈ ఇగ్నిస్ iUNIQUE పేరుతో లిమిటెడ్ ఎడిషన్ గా 100 యూనిట్లను మొదటి ఎంచుకునే 100 మందికి డెలివరీ ఇవ్వనుంది. దీనిని 16,900 యూరోలతో (ఇండియన్ కరెన్సీలో 12.25 లక్షలు) విడుదల చేసింది.

ప్రస్తుతం మారుతి అభివృద్ది చేసిన iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్ కన్నా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఇగ్నిస్ ఇంటీరియర్ ను బియానిక్ ఆర్టికో బైకలర్ మరియు ఆజ్జురో మాల్దివ్ బైకలర్ అనే డ్యూయల్ టోన్ రంగుల్లో ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది.

ఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి 2015 టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించిన సుజుకి ఇగ్నిస్ ట్రయల్ కాన్సెప్ట్ రూపాన్ని తలపిస్తుంది.

ఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ లో ఎల్ఇడి హెడ్ లైట్లు, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఆరేంజ్ ఫ్రేమ్‌లో ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్ రూఫ్ మీద సిల్వర్ రూఫ్ రెయిల్ మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్‌లో, డోర్ హ్యాండిల్స్ మరియు సెంటర్ కన్సోల్, ఏ/సి ఎయిర్ వెంట్‌లను ఆరేంజ్ రంగుల్లో తీర్చిదిద్దారు.

ఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 3డి మ్యాప్స్ తో తాకే తెర గల న్యావిగేషన్ సిస్టమ్, రియర్ వీవ్యూ కెమెరా మరియు ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ డోర్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సాంకేతికంగా మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ లో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్ ఫ్రమ్ సుజుకి అనే హైబ్రిడ్ పరిజ్ఞానంతో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న డ్యూయల్ జెట్ ఇంజన్ అందించారు.

ఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ లోని శక్తివంతమైన ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ వద్ద 89బిహెచ్‌పి గరిష్ట పవర్ మరియు 4,400ఆర్‌పిఎమ్ వద్ద 120ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్ లోని పెట్రోల్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 12-వోల్ట్ లిథియమ్ అయాన్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా అదనంగా 3.08బిహెచ్‌పి పవర్ మరియు 50ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి అవుతుంది.

కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేశారు. దీని ద్వారా ఆల్‌గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ నుండి అన్ని చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది.

మారుతి సుజుకిఇగ్నిస్ iUNIQUE లిమిటెడ్ ఎడిషన్

- మాల్యా పాపం పండిన రోజు
- డొనాల్డ్ ట్రంప్ నువ్వు సామాన్యుడివి కాదు సామీ...
- హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం


Click it and Unblock the Notifications








