ఫిబ్రవరి 2017 లో విడుదల కానున్న సుజుకి ఇగ్నిస్
ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇగ్నిస్ క్రాసోవర్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మారుతి సుజుకి సన్నాహాలు చేస్తోంది.
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో తమ సరికొత్త ఇగ్నిస్ క్రాసోవర్ ద్వారా నూతన ప్రయోగం చేయనుంది. విపణిలోకి విడుదలయ్యే ప్రతి మారుతి ప్రొడక్ట్ మంచి విజయాన్ని అందుకుంటోంది. అయితే ఆ ప్రతి ప్రొడక్ట్ సరికొత్త సెగ్మెంట్ పేరుతో విడుదల కావడం విశేషం. ఇప్పుడు అదే దారిలో క్రాసోవర్ అంటూ తమ ఇగ్నిస్ ను మార్కెట్లోకి విడుదల చేయడానికి చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

మారుతి తమ ఈ మిని క్రాసోవర్ ఇగ్నిస్ ను మొదటి సారిగా 2015 టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది. ఆ తరువాత 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శనలో ప్రదర్శించింది.

ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి మారుతి ఈ ఇగ్నిస్ ను దేశీయ విపణిలోకి విడుదల చేయాల్సి ఉండగా, తమ ఉత్పత్తుల మీద వెయిటింగ్ పీరియడ్ మరియు అమ్మకాలు మీద సంస్థ దృష్టి సారించడంతో ఇగ్నిస్ విడుదల వాయిదా పడింది.

అయితే ఫిబ్రవరి 2017 నాటికి మారుతి సుజుకి తమ ఇగ్నిస్ మిని క్రాసోవర్ ను విడుదల చేయడానికి దాదాపుగా సిద్దమైంది.

రిపోర్ట్స్ ప్రకారం మారుతి సుజుకి ఇగ్నిస్ 1-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. మొదటి ఈ ఇగ్నిస్ కేవలం పెట్రోల్ ఆప్షన్‌లో మాత్రమే పరిచయం కానుంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం జరిగే అవకాశం ఉంది.

అంతే కాకుండా సరికొత్త ఇగ్నిస్ 1.2-లీటర్ విటివిటి పెట్రోల్ మరియు 1.3-లీటర్ మల్టీ జెట్ డీజల్ ఇంజన్ తో పరిచయం కానుందనే సమచారం నెట్టింట్లో తెగ సంచారం చేస్తోంది.

ఎక్ట్సీరియర్ పరంగా మిని క్రాసోవర్ ఇగ్నిస్ లో పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు, ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లతో పాటు గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ (180 ఎమ్ఎమ్) దీని సొంతం.

ఇగ్నిస్ ఇంటీరియర్ పరంగా టాప్ ఎండ్ హార్మన్ కర్డాన్ ఆడియో సిస్టమ్‌తో పాటు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లతో రానుంది.

మారుతి సుజుకి ప్రారంభించిన నెక్సా ప్రీమియమ్ డీలర్ షిప్‌ల నుండి ఇగ్నిస్ విక్రయాలు జరగనున్నాయి. మారుతి ఈ ఇగ్నిస్ ను విడుదల చేస్తే మహీంద్రా కెయువి100 మీద గట్టి పోటీని ఇవ్వనుంది.

మారుతి సుజుకి ఈ మిని క్రాసోవర్ ఇగ్నిస్ ను 5.5 లక్షల రుపాయల ప్రారంభ ధరతో విడుదల చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటికే ఆల్ వీల్ డ్రైవ్ ఇగ్నిస్ కార్లు జపనీస్ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నాయి. అయితే దేశీయంగా వీటి విడుదల గురించి మారుతి సుజుకి ఊసెత్తడం లేదు.

- విడుదల కంటే ముందుగా సుజుకి ఇగ్నిస్ డెలివరీ
- క్విడ్ పై అరుదైన ఆఫర్: క్యాష్ బ్యాక్, క్యాష్ లెస్ పేమెంట్, 100 శాతం బుణం


Click it and Unblock the Notifications








