భారతీయ రోడ్ల మీద రహస్య పరీక్షలకు సిద్దమైన మారుతి సుజుకి ఇగ్నిస్
మారుతి సుజుకి గత వారంలో జరగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ ఇగ్నిస్ క్రాసోవర్ కారును ప్రదర్శించింది. అయితే తాజగా భారతీయ రోడ్ల మీద బట్టలు మార్చుకుని తిరుగుతున్న ఈ ఇగ్నిస్ కారు ఇలా అడ్డంగా కెమెరాలకు దొరికిపోయింది.
మారుతి సుజుకి దీనికి పరీక్షలు నిర్వహిస్తుడగా ఇలా మా కంట పడింది. దీనికి చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి వారు తమ నాలుగు మీటర్ల సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి ఐ-ఎమ్4 కాన్సెప్ట్ ఆధారంతో రూపొందించారు. అయితే మారుతి సుజుకి దీనిని అప్పటికే జపాన్‌లో అధికారికంగా విడుదల చేశారు.

అయితే ఈ నాలుగు మీటర్ల క్రాసోవర్ కారును ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభం నాటికి దేశ వ్యాప్తంగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్ కారును టాల్ బాడీ డిజైన్ ఉండే విధంగా డిజైన్ చేశారు. దీని వలన ముందు వైపు హై ఐ పాయింట్ తో గమనించవచ్చు. మరియు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అధికంగా కల్పించారు.

ప్రస్తుతం జపాన్‌లో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ ఇగ్నిస్ క్రాసోవర్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల డ్యూయెల్ జెట్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్‌లో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే వ్యవస్థను ఇన్‌స్టాల్ చేశారు.

అయితే భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్న ఇగ్నిస్ కారులో 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ రానుంది.

ఈ ఇంజన్ దాదాపుగా లీటర్‌కు 25.2 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇవ్వగలదు.

దేశీయ మార్కెట్లోకి రానున్న ఈ కారు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానుంది. ఈ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌కు అదనంగా హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు గ్రిప్ కంట్రోల్ వ్యవస్థలు కలవు.

భద్రత పరంగా మారుతి సుజుకి తమ ఇగ్నిస్‌లోని అన్ని వేరియంట్లలో కూడా ఎయిర్ బ్యాగులు, యాంటి లాక బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు అందించారు.

వినోదభరితమైన ఫీచర్లకు కూడా ఇందులో చోటు కల్పించారు. ఇన్ బిల్ట్ మెమొరీ గల తాకే తెర న్యావిగేషన్ సిస్టమ్, ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఇందులో కలవు.

మారుతి సుజుకి మార్కెట్లోకి తమ ఇగ్నిస్ కారును విడుదల చేస్తే మహీంద్రా అండ్ మహీంద్రా వారి కెయువి100 మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లకు సమానంగా నిలవనుంది.

దీని ధర దాదాపుగా రూ. 4 నుండి 6 లక్షల మద్య ఉండవచ్చు

అందుబాటులోకి
మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా గల తమ నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మారుతి తమ నెక్సా షో రూమ్‌లోల ఎస్-క్రాస్ మరియు బాలెనొ కార్లను విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications