మారుతి సుజుకి ఇగ్నిస్‌కు రహస్య పరీక్షలు-విడుదలకు ఆసన్నమైందా ?
దేశీయ అతి పెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఏడాదిలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ఇగ్నిస్ మరియు బాలెనొ ఆర్‌ఎస్ అనే రెండు కాన్సెప్ట్ కార్లను ప్రదర్శించింది. అందులో ఇగ్నిస్ కారు త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కావడానికి ఆసన్నమవుతోంది.

పెద్ద బాక్సు వంటి ఆకారంలో ఎంతో మంది సందర్శకులను ఆకట్టుకుంది ఈ ఇగ్నిస్ మరియు క్రాసోవర్ లక్షణాలు దగ్గరగా ఉండేందుకు అన్నట్లుగా దీనికి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా కల్పించారు.
మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ కారును విడుదల చేసే ముందు అత్యంత రహస్యంగా ఎటువంటి ఫీచర్లు మరియు డిజైన్ లక్షణాలు విడుదలవ్వకుండా జాగ్రత పడుతూ ఢిల్లీ నగరంలో రహదారి పరీక్షలు నిర్వహించింది.
త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి వారి ఎనిమిది కొత్త కార్లు ఇవే
మారుతి సుజుకి ఉత్పత్తికి సిద్దమైన కాన్సెప్ట్‌గా దీనిని ప్రదర్శించినపుడు ఇందులో పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లను కలిగి ఉన్న హెడ్ ల్యాంప్స్ ఉండేవి. మరియు ఆసాధారణంగా కొంచెం వాలుగా క్రింద నుండి పైకి పెరుగుతూ ఉండే విధంగా ఉన్న రియర్ విండో డిజైన్ కొంచం ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇక దీనికి అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు టాప్ మీద రూఫ్ రెయిల్స్‌ను అందించారు. మారుతి సుజుకి దీనిని ఈ ఏడాది పండుగ సీజన్‌కు ముందుగానే అంటే దసరా మరియు దీపావళి వంటి పండుగులకు సిద్దంగా ఉండేట్లు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
హోండా అమేజ్ అస్సలు కొనుగోలు చేయకండి.... ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్న బాధితుడు


Click it and Unblock the Notifications









