ఒక్క సెప్టెంబర్‌లోనే 29.4 శాతం వృద్దిని నమోదు చేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి (Maruti Suzuki) గడిచిన 2016 సెప్టెంబర్ అమ్మకాల్లో భారీ వృద్దిని సాధించింది. ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభ కావడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. దేశీయ అమ్మకాల్లో ఏకంగా 29.4 శాతం వృద్దిని సాధించింది.

మారుతి గడిచిన సెప్టెంబర్ 2016 ఏడాదిలో 1,37,321 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. ఇదే నెల గత ఏడాదిలో అమ్మకాలు గమనిస్తే 1,06,083 యూనిట్లుగా ఉన్నాయి.

ఈ ఏడాది జూలైలో కూడా మంచి అమ్మకాలు సాధించింది. జూలై 2016 లో 1,25,778 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఉన్న అవకాశాలు దృష్ట్యా మారుతి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్దిని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది మారుతి సుజుకి.

దేశవ్యాప్తంగా వినియోగదారులు మారుతిలోని విభిన్నమైన ఉత్పత్తులన్నింటిని ఎంచుకుంటున్నారు. అమ్మకాల్లో వృద్దిని సాధించిన ఉత్పత్తుల్లో సియాజ్, బాలెనొ, వితారా బ్రిజా మరియు ఎస్-క్రాస్ లు ఉన్నాయి.

అంతే కాకుండా చిన్న ఉత్పత్తులైన ఆల్టో మరియు వ్యాగన్ ఆర్ లు గడిచిన సెప్టెంబర్‌లో 44,395 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 35,570 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఏకంగా 24.8 శాతం వృద్ది ఎగబాకింది.

కాంపాక్ట్ సెగ్మెంట్లో ఉన్న స్విఫ్ట్, రిట్జ్, సెలెరియో, బాలెనొ మరియు డిజైర్ ఉత్పత్తులు 50,324 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ ఉత్పత్తులు 44,826 వరకు అమ్ముడయ్యాయి. వీటి పరంగా 123 వృద్ది సాధ్యమైంది.

మారుతి లోని యుటిలిటి వాహనాలైన జిప్సీ, ఎస్-క్రాస్, వితారా బ్రిజా మరియు ఎర్టిగా అమ్మకాలు 18,423 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలానికి 6,331 యూనిట్లుగా ఉండేది.

191 వృద్దిని సాధించి యుటిలిటి వాహనాల అమ్మకాల్లో భారీ వృద్దిని దక్కించుకుంది మారుతి సుజుకి.

- అద్భుతమైన ధరతో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్
- ఇగ్నిస్ కోసం మార్గం సుగమం చేసిన మారుతి రిట్జ్
- అన్నీ సిద్దం చేసుకున్న సుజుకి ఇక సంచలనాలే


Click it and Unblock the Notifications








