ఉత్పత్తి ప్లాంటులను మూసివేసిన మారుతి సుజుకి
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సంస్థ ఇండియాలో ఉన్న తమ గుర్గావ్ మరియు మనేసార్ ప్లాంటులో కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉత్పత్తిని నిలిపివేయడానికి గల కారణాలను కోసం ప్రయత్నించగా ప్రతి రెండేళ్లకోసారి మారుతి వారు తమ ఉత్పత్తి ప్లాంటుల నిర్వహణ చేపడతారు. అందులో భాగంగానే ద్వైవార్షిక నిర్వహణ కోసం జూన్ 6, 2016 నుండి జూన్ 11, 2016 వరకు ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసినట్లు ప్రకటించారు.
టాప్-10 జాబితాలో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి !
ప్రతి రెండేళ్లకోసారి ఏడాది మధ్య భాగంలో జూన్ చివరి నాటికి తమ ప్లాంటుల నిర్వహణను చేపడతారు. ఈ ప్లాంటులో ఇంతకు మునుపు ఎయిర్ కండీషనింగ్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ సబ్రో మారుతి వారి రెండు ప్లాంటులలోనే కావాల్సిన ఉత్పత్తులను అవసరాలకు అనుగుణంగా అక్కడిక్కడే ఉత్పత్తి చేసేది. అయితే ఈ సంస్థ ప్లాంటులలో ఉన్నందు వలన నిర్వహణ కాస్త అలస్యం అయినట్లు తెలిసింది.
మూడు స్టార్ల భద్రత రేటింగ్‌తో అన్నింటికన్నా ముందున్న బాలెనొ
మారుతి రెండు ఉత్పత్తి ప్లాంటుల నుండి రోజుకు మొత్తం 5,000 వరకు కార్లు మరియు ఎస్‌యువిల ఉత్పత్తి జరిగేది, సంవత్సరానికి అయితే సుమారు 15 లక్షల యూనిట్ల వరకు ఉత్పత్తి జరుగుతుంది. నిర్వహణ కోసం నిలిపివేసిన ఉత్పత్తి ప్రస్తుతం వినియోగదారులు ఎదురు చూస్తున్న కార్ల యొక్క డెలివరీ సమయం మరింత పెరగడానికి కారణం అయింది. మారుతి సుజుకి బాలెనొ (ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ - 6 నెలలు) మరియు వితారా బ్రిజా (ప్రస్తుతం కాలపరిమితి - 9 నెలలు)గా ఉంది.



Click it and Unblock the Notifications