మారుతి సుజుకి కొత్త రికార్డుకు కారణం ఈ రెండే కీలకం
భారత దేశపు లీడింగ్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత జూలై 2016 అమ్మకాల్లో 1,37,116 యూనిట్ల అమ్మకాలు జరిపి ఊహించిన విధంగా రికార్డును సృష్టించింది. మొత్తం అమ్మకాల్లో 1,25,778 యూనిట్లు దేశీయంగా మరియు 11,338 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి.

దేశీయంగా జరిగిన అమ్మకాల్లో 1,25,778 యూనిట్ల సేల్స్ మారుతి వారి చరిత్రలో మొదటి రికార్డు. గత ఏడాదితో పోల్చుకుంటే 12.7 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

ఈ యేడు మారుతి లైనప్‌లో ఉన్న యుటిలిటి వాహనాల అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది జూలై 2015 లో 6,916 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది జూలైలో ఏకంగా 17,382 యూనిట్లు అమ్ముడయ్యాయి.

యుటిలిటి వాహనాల అమ్మకాల్లో వితారా బ్రిజా వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. 10,000 యూనిట్లు అమ్ముడుపోయాయి.

అయితే మిగిలిన మిగిలిన వాహనాలు సాధారణంగానే అమ్మకాలు జరిపాయి. అందులో స్విఫ్ట్, రిట్జ్, సెలెరియో మరియు బాలెనో హ్యాచ్‌బాక్య్ మరియు స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లు 4.1 శాతం వృద్ది చెందాయి.

మారుతిలో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వితారా బ్రిజా మరియు బాలెనొలు మాత్రమే సుమారుగా లక్ష వరకు బుకింగ్స్ మరియు అమ్మకాలు జరిపాయి.

బాలెనొ మరియు వితారా బ్రిజాలను డెలివరీ ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుండటం వల్లనే మారుతి తమ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ విడుదలను వాయిదా వేస్తూ వస్తోంది.

మారుతి అమ్మకాల వృద్దికి మరొక కారణం సియాజ్ సెడాన్. గత ఏడాది జూలైలో 2,099 యూనిట్ల అమ్మకాలు జరపగా, జూలై 2016 లో 5,162 యూనిట్ల అమ్మకాలు జరిగి 145.9 శాతం వృద్దని నమోదు చేసుకుంది.

అయితే మారుతి సుజుకిలోని మిని సెగ్మెంట్లో ఉన్న ఆల్టో మరియు వ్యాగన్‌ఆర్‌ల అమ్మకాల వృద్ది 7.2 శాతం క్షీణించింది

- రానున్న ఏడాదిలోపు మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త కార్లు
- మహీంద్రా కెయువి100 వర్సెస్ మారుతి ఇగ్నిస్



Click it and Unblock the Notifications