2017 మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ సందడి
జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ సుజుకి బ్రెజిల్‌లో జరగుతున్న 20107 Sao Paulo ఆటో షో వేదిక మీద 2017 సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రదర్శించింది.
మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవల్ ను గత ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. అయితే ఎస్-క్రాస్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తోంది. గతంలో అనేక మార్లు రహస్య పరీక్షలకు గురైన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ కొన్ని ఆటో షో వేదికల మీద కూడా ప్రదర్శితమైంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల కానున్న 2017 ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ 2017 Sao Paulo ఆటో షో వేదిక మీద ప్రదర్శించబడింది.

బ్రెజిల్ కేంద్రంగా జరుగుతున్న ఆటో షోలో ప్రదర్శించడిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో బాగా గుర్తించదగిన అతి ముఖ్యమైన మార్పులకు గురైంది. ఆటో షో వేదికగా కంపెనీ 4You, 4Style మరియు 4Style AllGrip మూడు విభిన్న వేరియంట్లను ప్రదర్శించింది.

ప్రస్తుతం ఉన్న ఎస్-క్రాస్ ఫ్రంట్ డిజైన్‌తో పోల్చుకుంటే ఈ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. క్రోమ్ పూత పూయబడిన, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ కలదు, దీని మీద పొడవాటి స్లాట్లు ఉన్నాయి. రేడియేటర్‌కు ఎక్కువ గాలిని గ్రహించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇందులోని ఫ్రంట్ బంపర్, హెడ్ లైట్లు, క్రోమ్ ఫ్రేమ్ గల ఫాగ్ లైట్లు మరియు ఎల్‌ఇడి టెయిల్ లైట్లను రీ డిజైన్‌లో పరిచయం చేశారు.

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ లోని ఇంటీరియర్‌లో 8-అంగుళాల పరిమాణంలో ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. దీనికి ఇరువైపు బటన్ల ద్వారా నియంత్రించే వెసులుబాటు కల్పించారు. ఈ ఫీచర్ మినహాయిస్తే ఇంటీరియర్ మొత్తం మునుపటి ఎస్-క్రాస్ తరహాలోనే ఉంది.

ఈ ఆటో షో వేదిక మీద ప్రదర్శించిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగులు, స్టెబిలిటి కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను సుజుకి పరిచయం చేసింది.

2017 బ్రెజిల్ ఆధారిత ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ లో 126బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు.

మరియు 146బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేశారు.

రెండు ఇంజన్‌లకు కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇక ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ లోని4స్టైల్ వేరియంట్లో సుజుకి వారి ఆల్‌గ్రిప్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పరిచయం చేశారు.

2017 మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ 2017 ప్రారంభంలో బ్రెజిల్ మార్కెట్లో విడుదలయిన అనంతరం ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది.

విడుదల సమయానికి దీని ధర సుమారుగా రూ. 19.1 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

- సరిగ్గా 5 లక్షల బడ్జెట్లో కారు కావాలా...?
- అర్థం లేని మారుతి నిర్ణయం: విడుదల కంటే ముందుగా ఇగ్నిస్ డెలివరీ !!
- మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్ తో సంచలనాలు ఖాయం


Click it and Unblock the Notifications








