ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ను ప్రదర్శించిన మారుతి సుజుకి

By Anil

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి విసృతమైన శ్రేణి వాహనాలను అందించడానికి పన్నాగం పన్నతోందని గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో స్పష్టం చేసింది. ఈ ఆటో ఎక్స్ పో వేదిక ద్వారా కాంపాక్ట్ క్రాసోవర్ల విభాగంలోకి సరికొత్త ఇగ్నిస్ కారును ప్రవేశ పెట్టింది.

మారుతి సుజుకి 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఈ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ కారు ఇంతకు ముందు జరిగిన 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించబడింది. ఇగ్నిస్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

డిజైన్

డిజైన్

మారుతి సుజుకి వారి ఇగ్నిస్ కారు డిజైన్ 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన ఐఎమ్-4 కాన్సెప్ట్ మోడల్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇది చూడటానికి ముందు వైపు ఎస్‌యువి వంటి డిజైన్ కలిగి ఉంటుంది మరియు చిన్న ఎస్‌యువిని పోలి ఉంటుంది.

ఇగ్నిస్‌లోని ఇంజన్ వివరాలు

ఇగ్నిస్‌లోని ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి తమ ఇగ్నిస్ కారును రెండు ఇంజన్ రకాలలో అందివ్వనుంది. పెట్రోల్ ఇంజన్‌ను స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు నుండి గ్రహించి మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌ను ఫియట్ సంస్థ నుండి సేకరించనుంది.

పవర్

పవర్

  • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83 బిహెచ్‌పి పవర్
  • 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 74 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తాయి.
  •  టార్క్

    టార్క్

    పెట్రోల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్

    డీజల్ ఇంజన్ 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

    మైలేజ్ (ఇంధన సామర్థ్యం)

    మైలేజ్ (ఇంధన సామర్థ్యం)

    • పెట్రోల్ ఇంజన్: లీటర్‌కు20.4 కిలోమీటర్లు
    • డీజల్ ఇంజన్: లీటర్‌కు 25.2 కిలోమీటర్లు
    • అందుబాటులోకి

      అందుబాటులోకి

      మారుతి సుజుకి వారు ఈ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్‌ను దసరా, దీపావళి పండుగ సీజన్ మధ్యలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

       నెక్సా షోరూమ్ నుండి

      నెక్సా షోరూమ్ నుండి

      మారుతి సుజుకి తమ నెక్సా షోరూమ్ నుండి ఈ ఇగ్నిస్ క్రాసోవర్‌ను అందివ్వనున్నారు. దీని ద్వారా నెక్సా షోరూమ్ నుండి మారుతి సుజుకి వారి మూడు మోడళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

      ఇగ్నిస్ ధర

      ఇగ్నిస్ ధర

      మారుతి సుజుకి వారి సరికొత్త కాంపాక్ట్ క్రాసోవర్ ఇగ్నిస్ ధర దాదాపుగా రూ. 4 నుండి 6 లక్షల మధ్య ఉండనుంది.

      పోటి

      పోటి

      మారుతి సుజుకి తమ కాంపాక్ట్ క్రాసోవర్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా కెయువి100 మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి మోడళ్లకు పోటిగా నిలవనుంది.

      ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ను ప్రదర్శించిన మారుతి సుజుకి
      • మారుతి సుజుకి సరికొత్త వితారా బ్రిజాను ప్రదర్శించింది దీని గురించి మరింత తెలుసుకోండి.

Article Published On: Monday, February 8, 2016, 10:17 [IST]
English summary
Maruti Looks To Ignite Compact Crossover Segment With Ignis Concept
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+