టాటా ఏస్‌కు పోటీగా ట్రక్కును విడుదల చేసిన మారుతి సుజుకి
చిన్న చిన్న వస్తువులు మరియు సరుకులను తక్కువ దూరాలకు చేరవేయడానికి వినియోగించే వాహనాలను లైట్ కమర్షియల్ వెహికల్స్ అంటారు. మన భాషంలో వీటికి ఉదాహరణగా చెప్పాలంటే టాటా ఏస్, మహీంద్రా మ్యాక్సిమో వంటివి అనొచ్చు.
దేశీయంగా మంచి ఆదరణ పొందిన ఈ లైట్ కమర్షియల్ వాహనాలకు పోటీగా కార్లను తయారు చేసే సంస్థ మారుతి సుజుకి ఎల్‌సివిగా సూపర్ క్యారీ ట్రక్‌ను విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

మారుతి సుజుకి ఈ సూపర్ క్యారీ వాహనాన్ని 4.01 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా విడుదల చేసింది.

ప్రస్తుతం విడుదలైన ఈ సూపర్ క్యారీ ట్రక్ ఆగష్టు చివరి నాటికి అమ్మకాలకు పూర్తి స్థాయిలో సిద్దం కానుంది. దీనిని ప్రారంభంలో అహ్మదాబాద్, లుధియానా మరియు కోల్‌కత్తాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

మారుతి సుజుకి సూపర్ క్యారీ ధరలు
- లుధియానా ధర రూ. 4.01 లక్షలు
- అహ్మదాబాద్ ధర రూ. 4.03 లక్షలు
- కలకత్తా ధర రూ. 4.11 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

సాంకేతికంగా మారుతి సుజుకి ఇందులో 793సీసీ సామర్థ్యం గల రెండు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించారు. దీనిని మనం మారుతి సెలెరియోలోని డీజల్ వేరియంట్లో గమనించవచ్చు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 33.5బిహెచ్‌పి పవర్ మరియు 75ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

మారుతి వారి ఈ సూపర్ క్యారీ వాహనం లీటర్‌కు 22.07 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది.

దీనిని వెంటనే ఆపడానికి ముందు వైపున డిస్క్ బ్రేకులను కల్పించారు. అంతే కాకుండా ఇందులో బ్రేకింగ్ సమయంలో మంచి స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ఇందులో లోడ్ సెన్సింగ్ ప్రపోర్షనింగ్ వాల్వ్‌ను అందించారు.

కొలతల పరంగా ఈ వాహనం 3,800ఎమ్ఎమ్ పొడవు, 1,562ఎమ్ఎమ్ వెడల్పు మరియు 1,868ఎమ్ఎమ్ ఎత్తుతో పాటు 2,110ఎమ్ఎమ్ వీల్ బేస్ మరియు 160ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. దీని బరువు 740 కిలోలుగా ఉంది.

ఫీచర్ల పరంగా ఇందులో ఛార్జింగ్ సాకెట్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ మరియు డిజిటల్ గడియారంతో పాటు ఇందులో మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా కల్పించుకోవచ్చు.

ఇందులో జింక్ పూత పూయబడిన ఐరన్ ఛాసిస్‌ను అందించారు. ఇది త్వరగా తుప్పు పట్టుకుండా ఉంటుంది. క్యాబిన్ మధ్యలో వెనుక వైపు అద్దం మరియు రెయిన్ గార్డ్ వంటివి ఇందులో ఉన్నాయి.

సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం
ఇప్పటి వరకు ఊహించని రూపంలో నూతన స్విఫ్ట్


Click it and Unblock the Notifications








