లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ డెకాను విడుదల చేసిన మారుతి సుజుకి
దేశీయంగా పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అమ్మకాల్లో జోరును పెంచుకునేందుకు మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌ను డెకాన్ అనే లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారుకు స్విఫ్ట్ డెకా అనే పేరును నిర్ణయించారు.

మారుతి వీటిని లిమిటెడ్‌గానే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు స్పష్టం చేసింది. అంటే స్టాక్ అయిపోయోలాగో ఉన్న వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి అన్నమాట.

లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ డెకా లోని విఎక్స్ఐ ధర రూ. 5,94,445 లు మరియు విడిఐ వేరియంట్ ధర రూ. 6,86,983 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి సుజుకి తమ స్విఫ్ట్ డెకాలో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లను ఇందులో అందించింది. ఈ రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందించారు.

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. మరియు లీటర్‌కు 20.4కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. అదే విధంగా ఇందులోని డీజల్ ఇంజన్ సుమారుగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇది లీటర్‌కు 25.2కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

సాంకేతికంగా అటుంచితే డిజైన్ పరంగా ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంది. కొన్ని లక్షల స్విఫ్ట్ కార్లు ఇండియన్ రోడ్ల మీద పరుగులు పెడుతున్న వాటితో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంది. ఇది అత్యంత ప్రకాశవంతమైన రెడ్ మరియు పియర్ల్ వైట్ రంగుల కాంబినేషన్‌లో ఉంది.

స్విఫ్ట్ డెకాలోని సైడ్ స్కర్ట్‌ల మీద 10 అనే ప్రత్యేక డీకాల్స్‌ను అందించారు. వెనుక వైపున ఆకర్షణీయమైన స్పాయిలర్ కలదు. వీల్ కవర్లకు సిల్వర్‌కు బదులుగా గ్లాస్ ఫినిష్ బ్లాక్ కలర్‌ను అందించారు.

ఇంటీరియర్ దీని ప్రత్యేకతలను ఎక్కువగా గమనించవచ్చు. సీట్ కవర్లను రెడ్ మరియు బ్లాక్, వైట్ రంగుల్లో ఉండేట్లు డిజైన్ చేశారు. అదే రూపంలో స్టీరంగ్ తొడుగులను కూడా డిజైన్ చేశారు.

ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇందులో కొత్త సోని మల్టీ మీడియా మ్యూజిక్ సిస్టమ్‌ను పరిచయం చేసారు ఇందులో బ్లూ టూత్ మరియు మైక్రో ఫోన్ అనుసంధానం చేసే అవకాశం కలదు. డోర్ల మీద అందించిన ఆరు స్పీకర్లకు ఈ మ్యూజిక్ సిస్టమ్‌ను అనుసంధానం చేసారు.

ఇంటీరియర్ మొత్తం ఆంబియంట్ లైటింగ్‌ను అందించారు. మరియు లగ్జరీ కార్ల తరహాలో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ మధ్యన ఉన్న సెంటర్ కన్సోల్ కార్బన్ ఫైబర్‌తో డిజైన్ చేశారు.

ఏ విషయం పరంగా ఇండియాలోని ఈ రైల్వే స్టేషన్లు అత్యంత ప్రత్యేకం
నువోస్పోర్ట్ మీద భారీ ఆఫర్లు ప్రకటించిన మహీంద్రా


Click it and Unblock the Notifications








