ఆటో గేర్ షిఫ్ట్ తో వస్తున్న మారుతి సుజుకి డిజైర్ 8.39 లక్షలకే
భారతీయ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి. మారుతి సుజుకిలో అత్యంత ఆదరణ పొందిన సెడాన్ కారు స్విఫ్ట్ డిజైర్. ఈ సెడాన్ కారు ప్రస్తుతం మన ముందుకు ఆటోగేర్ షిఫ్ట్ ఆప్షన్‌తో మన ముందుకు వచ్చింది.
మారుతి సుజుకి విడుదల చేసిన స్విఫ్ట్ డిజైర్ ఆటో గేర్ ఆప్షన్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి వారు మార్కెట్లోకి విడుదల చేసిన ఎజిఎస్ టెక్నాలజీ గల స్విఫ్ట్ డిజైర్ కారు ధర రూ. 8.39 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీ గా ఉంది.

మారుతి సుజుకి వారు ఈ ఎజిఎస్ టెక్నాలజీని స్విఫ్ట్ డిజైర్ మొదటి డీజల్ మోడల్ కారులో అందించారు.

మారుతి సుజుకి వారు ఈ ఆటోగేర్ షిఫ్ట్ టెక్నాలజీని మొదటి సారిగా సెలెరియో కారుతో పరిచయం చేశారు. ప్రస్తుతం ఆల్టో కె10 మరియు వ్యాగన్ఆర్ లలో దీనిని ఉపయోగిస్తున్నారు.

ఆటోగేర్ షిఫ్ట్ టెక్నాలజీతో వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు లీటర్ కు 26.59 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

మారుతి సుజుకి మార్కెట్లోకి డిజైర్ కారును పరిచయం చేసినప్పుటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 1.15 మిలియన్ కార్లు అమ్ముడుపోయాయి. భారతీయ మార్కెట్లో ఒక మిలియన్ సెడాన్ కార్ల అమ్మకాలు దాటిని ఏకైక సంస్థ మారుతి సుజుకి.

- 15 నిమిషాల ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు ప్రయాణించే వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు: ఇక్కడ క్లిక్ చేయండి
- ఫేస్ లిఫ్ట్ అవతారంలో రానున్న మారుతి సుజుకి ఆల్టో 800
- 10 లక్షలలోపు బడ్జెట్‌తో ఉత్తమ భద్రత ఫీచర్లు కలిగిన టాప్-10 కార్లు! గురించి తెలుసుకోండి.


Click it and Unblock the Notifications








