స్విఫ్ట్ స్పోర్ట్ కంటే ముందుగా విడుదల కానున్న 2017 స్విఫ్ట్ డిజైర్
2017 లో మారుతి తమ తరువాత తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది అనే ప్రకటన విడుదల చేసింది. అయితే దానికంటే ముందుగా స్విఫ్ట్ డిజైర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
మారుతి సుజుకి వచ్చే ఏడాదిలో 2017 స్విప్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది అనే విశయం తెలిసిందే. అయితే తరువాత తరానికి చెందిన అప్‌డేటెడ్ 2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసిన తర్వాతే స్విఫ్ట్ స్పోర్ట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

సమాచార వర్గాల కథనం మేరకు, 2017 లో మారుతి సుజుకి మొదటగా తమ స్విఫ్ట్ డిజైర్‌ను విడుదల చేసి ఆ తరువాత స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

గతంలో రెండు జనరేషన్ల నుండి విడుదలైన వాటిలో మొదట స్విఫ్ట్ ఆ తరువాత కొన్ని నెలల కాలానికి స్విఫ్ట్ డిజైర్ విడుదలయ్యాయి.

అయితే ఇప్పుడు దానికి విరుద్దంగా ముందుస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం 2017 లో స్విఫ్ట్ డిజైర్‌ను విడుదల చేసి ఆ తరువాత స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

మారుతి సుజుకి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ బాలెనొలో మరిన్ని అధునాత ఫీచర్లను మరియు సదుపాయాలను అందించి స్విఫ్ట్ కన్నా ఎక్కువ ధరతో విడుదల చేయనుంది.

ప్రస్తుతం ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో స్విఫ్ట్ డిజైర్ మాత్రమే మంచి అమ్మకాలు సాధిస్తోంది. అత్యంత పాత మోడల్ అయినప్పటికీ భారీ ఫలితాలను సాధిస్తోంది. అందుకోసం దీనిని ప్రెష్‌గా విడుదల చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తోంది.

2017 కు చెందిన స్విఫ్ట్ డిజైర్‌ను మారుతి ఇది వరకే పరీక్షించింది. ప్రస్తుతం ఉన్న డిజైర్‌తో పోల్చుకుంటే ఫ్రంట్ గ్రిల్ మరియు వెనుక వైపు డిజైన్‌లో పూర్తి మార్పులు చోటు చేసుకున్నాయి.

భారీ అప్‌డేట్స్‌తో 2017 నాటికి అందుబాటులోకి వస్తున్న స్విఫ్ట్ డిజైర్ వోక్స్‌వ్యాగన్ అమియో, హ్యుందాయ్ ఎక్సెంట్, మరియు త్వరలో విడుదలకు సిద్దమైన షెవర్లే ఎసెన్షియా మరియు టాటా కైట్ 5 లకు గట్టి పోటీగా నిలవనుంది.

- ఈ కొత్త కారుతో మార్కెట్‌ను కుదిపేయడం ఖాయం అంటున్న మారుతి
- రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు పోటీగా మహీంద్రా క్లాసిక్ బైకులు: అతి త్వరలో
- ఈ భారతీయ రోడ్ల మీద ప్రయాణం తాడు మీద నడిచే అనుభవానికి సమానం !


Click it and Unblock the Notifications








