మీరు ఊహించని ఉత్పత్తులు మా వద్ద ఉన్నాయంటున్న మారుతి
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన సియాజ్ మరియు బ్రిజా వానహనాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ విజయాన్ని అలాగే కొనసాగించడానికి మారుతి మరిన్ని పెద్ద కార్లను మరియు ఎస్‌యువిలను సిద్దం చేసుకుంది. అయితే వీటిని ఒక క్రమంలో విడుదల చేయనున్నట్లు మారుతి తెలిపింది.

మారుతి సుజుకి ఎమ్‌డి మరియు సిఇఒ, కెనిచి అయుకవా మాట్లాడుతూ "ఇండియాలో మారుతి అందుబాటులోకి తెచ్చిన సియాజ్ మరియు బ్రిజా కార్లకు మంచి ఆదరణ లభించింది. ఈ కాబట్టి భారతీయ వినియోగదారులు మారుతి నుండి మరిన్ని ప్రీమియమ్ కార్లను కోరుకుంటున్నారని తెలిపాడు".

వాహన రంగం యొక్క మార్కెట్లో మారుతి సుజుకి వాటా 47 శాతంగా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మరో శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయుకవా మాట్లాడుతూ 2017 నాటికి గుజరాత్‌లోని ప్లాంట్ నుండి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం మారుతి సుజుకి సంస్థకు హర్యానాలో గుర్గావ్ మరియు మనెసార్‌లలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి సుమారుగా 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలదు.

ఉత్పత్తిలో మూడవ షిఫ్ట్‌ను ప్రారంభిస్తే ప్రొడక్షన్ సామర్థ్యం మరో పది శాతం పెరగనున్నట్లు అయుకవా ప్రకటించారు. ఏదేమైనప్పటికీ ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మారుతి సుజకి లీడర్ పొజినషన్లో ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఆల్టోను మరొక కొత్త వెర్షన్‌లో విడుదల చేయడానికి మారుతి సుముఖంగా ఉన్నట్లు అయుకవా తెలిపారు.

సర్వే: 2016లో ఇండియాలో ఉన్న అత్యంత విశ్వసనీయమైన కార్లు
ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్


Click it and Unblock the Notifications








