వితారా బ్రిజా: ఎనిమిది నెలల్లో 1,72,000 బుకింగ్స్
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి తమ వితారా బ్రిజాను విడుదల చేసినప్పటి నుండి 1.72 లక్షల బుకింగ్స్ నమోదు చేసుకుంది. కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఈ తరహా స్పందన రావడం ఇదే మొదటి సారి.
భారత దేశపు ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇండియన్ మార్కట్లోకి తమ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేసింది. స్వల్ప వ్యవధిలోనే వితారా బ్రిజాకు ఊహించని స్పందన లభించింది. గడిచిన ఏనిమిది నెలల కాలంలో 1,72,000 యూనిట్ల బ్రిజా బుకింగ్స్ నమోదయ్యాయి.

మారుతి సుజుకి మార్కెటింగ్ హెడ్ ఆర్ఎస్ కల్సి నిర్వహించిన సమావేశంలో వితారా బ్రిజా బుకింగ్స్ మరియు అమ్మకాలకు సంభందించిన వివరాలను వెల్లడించారు. కేవలం డీజల్ వెర్షన్‌లో మాత్రమే విడుదలైన వితారా బ్రిజా ఇండియన్ ఎస్‌యువి సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువిగా పేరుపొందడానికి కాస్త సమయం తీసుకుందని కల్సి తెలిపారు.

సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యువి యొక్క నూతన డిజైన్ భాష, అత్యాధునిక ఫీచర్లతో నిండిన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. పట్టణ ఎస్‌యువి అమ్మకాల్లో పోర్డ్ ఎకో స్పోర్ట్ తర్వాత అత్యధిక అమ్మకాలు సాధించింది ఇదే.

వితారా బ్రిజా మీద కస్టమర్లు దృష్టి సారించేందుకు ఐక్రియేట్ అనే కస్టమైజేషన్ స్కీమ్‌ను మారుతి ప్రారంభించింది. దీని ద్వార వినియోగదారులు వితారా బ్రిజాలను తమ అభిరుచికి తగ్గట్లుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు.

ప్రస్తుతం వితారా బ్రిజాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో బుకింగ్స్ చేసుకున్న వారికి డెలివరీ ఇవ్వడానికి ప్రొడక్షన్ పరంగా మారుతి భారీ కష్టాన్ని చవిచూస్తోంది. ప్రొడక్షన్ ప్లాంటులో వితారా బ్రిజా ఉత్పత్తిని వేగవంతం చేసినప్పటికీ వెయిటింగ్ పీరియడ్ ఐదు నుండి ఆరు నెలల వరకు ఉంది.

నానాటికీ వితారా బ్రిజా కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి గుజరాత్‌లోని నూతన ప్లాంటులో మార్చి 2017 నుండి ప్రొడక్షన్ ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఏడాది మారుతి సుజుకి సంస్థకు మంచి విజయాన్ని అందించిన వితారా బ్రిజాలో 1.3-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో వచ్చిన వితారా బ్రిజా లీటర్‌కు 24.3 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

వితారా బ్రిజాలోని టాప్ ఎండ్ వేరియంట్లైన జడ్‌డిఐ మరియు జడ్‌డిఐ ప్లస్ వేరియంట్లు అత్యధిక విక్రయాలు జరుపుతున్నాయి. ఈ రెండు వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ కమాండ్, ఆపిల్ కార్ ప్లే మరియు బ్లూటూత్ కనెక్టివిటి గల స్మార్ట్ ప్లే ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. లెథర్ అప్‌హోల్‌స్ట్రేను ఇందులో గమనించవచ్చు.

వితారా బ్రిజాలో భద్రత పరంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటివి కలవు. బ్రిజా ధరలు రూ. 7.19 లక్షల నుండి 9.66 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

- వి12 విడుదల ఖరారు చేసిన బజాజ్: ధర మరియు ఇతర వివరాల కోసం..
- కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ కార్లు...!!


Click it and Unblock the Notifications








