ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఎంపికైన మారుతి వితారా బ్రిజా
2017 సంవత్సరానికి గాను మారుతి సుజుకి వారి వితారా బ్రిజా ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఎంపికయ్యింది.
ఇండియన్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి విడుదలైన వితారా బ్రిజా విడుదల నుండి ప్రత్యేకంగ నిలుస్తోంది. బుకింగ్స్ మరియు అమ్మకాల్లో అత్యంత విలువైన మైలురాళ్లను సాధించడం నుండి 2017 ఏడాదికి గాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఎంపికయ్యే వరకు మారుతికి ప్రత్యేకంగా నిలిచింది.

దేశ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ వార్తా ప్రతినిధులు మారుతి వారి వితారా బ్రిజాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు జ్యూరి సభ్యులు పేర్కొన్నారు.

ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ పోటీలో పాల్గొన్న హ్యుందాయ్ ఎలంట్రా, హ్యుందాయ్ టక్సన్, ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్, ఫోర్డ్ ఎండీవర్ లతో పాటు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు టాటా టియాగో వంటి వాటిని ఎదుర్కొని బ్రిజా ఈ అవార్డ్‌కు ఎంపికయ్యింది.

ఈ అవార్డ్ కోసం స్కోడా సూపర్బ్, టయోటా ఫార్చ్యూనర్, టయోటా ఇన్నోవా క్రిస్టా, హోండా బిఆర్-వి, ఆడి ఎ4, డాట్సన్ రెడి-గో, జాగ్వార్ ఎక్స్ఇ, మహీంద్రా కెయువి100, వోక్స్‌వ్యాగన్ అమియో, మహీంద్రా నువోస్పోర్ట్ లతో పాటు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి వంటి ఉత్పత్తులు నామినేషన్ వేశాయి.

ఇప్పటి వరకు దేశీయ విపణిలోకి ప్రతి నెలలో కూడా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల అమ్మకాల్లో అనేక ధపాలు స్థానం సంపాదించిన ఏకైక కాంపాక్ట్ ఎస్‌యువి ఈ మారుతి వితారా బ్రిజా.

విక్రయాల పరంగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి100 వంటి వాటికి ప్రత్యేక్షంగా గట్టి పోటీని సృష్టించింది.

పోటీ దారులను తలదన్నే ఫీచర్లతో పాటు అద్బుతమైన ఇంజన్ ఆప్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇండియా లైనప్‌లో ఉన్న బ్రిజా 88.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు.

సులభంగా మరియు స్మూత్‌గా గేర్లను మార్చడానికి వీలు గల 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

మారుతి సుజుకి మొదటి సారిగా కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా వాహనాలను మోడిఫై చేసే అవకాశాన్ని వితారా బ్రిజా ద్వారా కల్పించింది. దేశీయంగా ఉన్న సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిలో మరే వాహనానికి కూడా ఇలాంటి అవకాశం లేదు.

వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి ల ధరల శ్రేణి రూ. 7.19 లక్షల నుండి 9.66 లక్షలు మధ్యన ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

భారత్ అగ్ని-V అణు క్షిపణి పరీక్షలు:
అగ్ని-V అణు క్షిపణిని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ తరుణంలో చైనాతో పాటు భారత్ శత్రు దేశాలు భారత్‌ను చూసి మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది.

సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు:
జాతీయ మరియు రాష్ట్రీయ రహదారుల వెంబడి ఉన్న అన్ని మద్య దుకాణాలను తొలగించాలని భారత సర్వోన్నత న్యాస్థానం సంచలన తీర్పును వెలువరించింది.


Click it and Unblock the Notifications








