20,000 లు దాటిన మారుతి వితారా బ్రిజా బుకింగ్స్
దేశీయ అతి పెద్ద ప్రథమం కార్ల తయారీ సంస్థ ఈ నెల మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేసిన వితారా బ్రిజా ఎస్‌యువి భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదు చేసుకుంటోంది. తాజా 20,000 వరకు బుకింగ్స్ నమోదైనట్లు మారుతి సుజుకి వెల్లడించింది. మరియు దీని ఈ నెల 25 నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది.
మారుతి సుజుకి వితారా బ్రిజా గురించి మీకు తెలియన్ ఆసక్తికరమైన విషయాల గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

మారుతి సుజుకి ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని గ్లోబల్ సి ఫ్లాట్ ఫామ్ మీద రూపొందించారు. అయితే దీనిని పూర్తిగా స్వదేశీయ ఇంజనీర్లు అభివృద్ది చేశారు.

ఈ మోడల్‌లో దాదాపుగా 98 శాతం దేశీయంగా తయారైన విడి భాగాలను వినియోగించుకోనున్నారు. తద్వారా దీనిని 6.99 లక్షలు ప్రారంభ ధరతో అందివ్వడానికి ఎంతో సుగమయం అయ్యింది అని చెప్పవచ్చు.

వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.99 లక్షలు మొదలుకొని టాప్ ఎండ్ వేరియంట్ అయిన జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 9.68 లక్షల వరకు ఉంది.

ప్రస్తుతం మార్కెట్లోకి ఇప్పటి వరకు ఏవిధమైన పోటి లేకుండా మంచి అమ్మకాలు సాగిస్తున్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వారి టియువి300 లకు గట్టి పోటిగా మార్కెట్లోకి వచ్చింది. దీని రాకతో వీటి పరిస్థి ఆగమ్యగోచరమే....!

వితారా బ్రిజాలో కొన్ని అత్భుతమైన ఫీచర్లు: ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, ఆటోమేటిక్ హెడ్ లైట్, వర్షం వస్తే ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా కలదు.

నాలుగు మీటర్లు సెగ్మెంట్లో మంచి ఆటవిడుపుతో వచ్చిన వితారా బ్రిజా ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం లీటర్‌కు 24.3 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తుంది.

మీరు బాగా గమనించినట్లయితే మారుతి సుజుకి తమ స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ లను రంగరించి తయరు చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ వితారా బ్రిజా. అయితే వితారా బ్రిజాతో మారుతి మరొక కొత్త శకాన్ని ప్రారంభించగలదని మా అభిప్రాయం.

వార్తల్లో వితారా బ్రిజా
మారుతి సుజుకి మార్చి 8, 2016న మార్కెట్లోకి వితారా బ్రిజా ఎస్‌యువిని పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా విడుదల చేసింది.
వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు: మరిన్ని వివరాలు కోసం

మారుతి సుజుకి ఫిబ్రవరి నెల మొదటి వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ వితారా బ్రిజా ఎస్‌యువిని ప్రదర్శించింది. అప్పుడు దీనికి చెందిన ఫోటోలు....
వితారా బ్రిజా ను ప్రదర్శించిన మారుతి సుజుకి : ఫోటోలు (గ్యాలరీ)

- దక్షిణ భారత సినీ తారల ఖరీదైన కార్లు: దుమ్ములేపిన తెలుగు సెలబ్రిటీలు
- భారతీయ రోడ్ల మీద డ్రైవ్ చేస్తున్నారా అయితే ఇవి గమనించండి !
- వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!


Click it and Unblock the Notifications