వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు: మరిన్ని వివరాలు కోసం
దేశీయంగా గల అతి పెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంతో కాలంగా తమ వితారా బ్రిజా ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేయాలని ఎదురు చూసింది. అయితే క్రితం రోజు దీని విడుదలకు వేదిక అయ్యింది. ఎంతో దీని విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు వారందరికీ ఇప్పుడు ఇది శుభ వార్తగా పరిణమించింది.
ఎందుకంటే ? మారుతి సుజుకి వారి నాలుగు మీటర్ల పొడవున్న వితారా బ్రిజా ఎస్‌యువి విడుదల వివరాల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీకోసం క్రింది కథనం ద్వారా అందిస్తోంది.

వితారా బ్రిజా ధర వివరాలు
- ఎల్‌డిఐ ధర రూ. 6,99,000
- ఎల్‌డిఐ (ఒ) ధర రూ. 7,12,000
- విడిఐ ధర రూ. 7,62,000
- విడిఐ ధర రూ. (ఒ) 7,75,000
- జడ్‌డిఐ ధర రూ. 8,55,000
- జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 9,54,000
- జడ్‌డిఐ ప్లస్ డ్యూయల్ టోన్ ధర రూ. 9,68,000
- ఎల్‌డిఐ
- విడిఐ
- జడ్‌డిఐ
- జడ్‌డిఐ ప్లస్
- పొడవు: 3,995 ఎమ్ఎమ్
- వెడల్పు: 1,790 ఎమ్ఎమ్
- ఎత్తు: 1640 ఎమ్ఎమ్
- వీల్ బేస్: 2,500 ఎమ్ఎమ్
- గ్రౌండ్ క్లియరెన్స్: 198 ఎమ్ఎమ్
- ఆర్కిటిక్ వైట్
- గ్రానైట్ గ్రే
- సెరులియన్ బ్లూ
- ప్రీమియమ్ సిల్వర్
- బ్లేజింగ్ రెడ్
- ఫిర్రీ ఎల్లో
- మిడ్ నైట్ బ్లాక్ మరియు బ్లేజింగ్ రెడ్
- సెరూలిన్ బ్లూ మరియు ఆర్కిటిక్ వైట్
- ఫిర్రీ ఎల్లో మరియు ఆర్కిటిక్ వైట్
- క్రూయిజ్ కంట్రోల్
- ఆటో హెడ్ ల్యాంప్స్
- రెయిన్ సెన్సింగ్ వైపర్లు
- ఎలక్ట్రిక్ పవర్ ద్వారా బాహ్యపు అద్దాలను ఆపరేట్ చేయడం
- రివర్స్ పార్కింగ్ కెమెరా
- డ్యూయల్ టోన్ కలర్స్
- సెగ్మెంట్లో మొదటిసారిగా ఆపిల కార్ ప్లే కనెక్టివిటీ
- స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా రిమోట్ కంట్రోల్
- రెండు ఎయిర్ బ్యాగులు
- పెద్ద టైర్లు
- గేర్ షిఫ్ట్ ఇండికేటర్
- స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్
- ఇన్‌బిల్ట్ న్యావిగేషన్ విత్ మ్యాప్
- ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్
- వెనుక వైపున ఫ్లిప్ ఫోల్డ్ సీట్లు
- ప్రి టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిట్ గల ముందు వైపు సీట్ బెల్ట్
- మారుతి సుజుకి వితారా బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు
- వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...దీని ఇంటీరియర్ చూసినోళ్లంతా ఆశ్చర్యపోవాల్సిందే

ఇంజన్ వివరాలు
మారుతి సుజుకి వారి ఈ సరికొత్త వితారా బ్రిజా ఎస్‌యువిలో నాలుగు సిలిండర్లు గల డిడిఐఎస్ 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు.

పవర్ మరియు టార్క్
ఇందులోని ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 88.5 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

ట్రాన్స్‌మిషన్
మారుతి సుజుకి తమ వితారా బ్రిజా ఎస్‌యువిలోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు.

మైలేజ్
మారుతి సుజుకి వితారా బ్రిజాకు పోటిగా నిలిచిన వాటిని ఎదుర్కోనేందు భారీ మైలేజ్‌తో వచ్చింది. ఏఆర్ఏఐ వారి ప్రకారం వితారా బ్రిజా మైలేజ్ లీటర్‌కు 24.3 కిలోమీటర్లు ఇస్తుంది.

అందుబాటులో ఉన్న వేరియంట్లు
ప్రతి కారులో కూడా వేరియంట్లు ఉంటాయి. మారుతి వారి వితారా బ్రిజా కారులో కూడా కొన్ని వేరియంట్లు ఉన్నాయి. అవి

డిజైన్
మారుతి సుజుకి విడుదల చేసిన ఈ వితారా బ్రిజా ముందు వైపు డిజైన్ మారుతి 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఎక్స్ఎ-ఆల్ఫా కాన్సెప్ట్‌ను పోలి ఉంది. అయితే దానికి కొన్ని మార్పులు చేసి అత్భుతమైన డిజైన్‌తో మారుతి ఈ వితారా బ్రిజాను విడుదల చేసింది.

ముందు వైపు గల డిజైన్ ఫీచర్లు
క్రోమ్ స్లాట్లను కల్పించిన ముందు వైపు గల ఫ్రంట్ గ్రిల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది, పగటి పూట వెలిగే లైట్లతో జతగా ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు ముందు వైపున రెండు చివర్లలో కొంచెం క్రిందగా ఫాగ్ ల్యాంప్స్‌ను అందించారు.

వెనుక వైపు డిజైన్
వెనుక వైపున కూడా డిజైన్ కోసం ఎక్కువ శ్రద్ద చూపారు. చిన్నగా మరియు కోణీయ ఆకారంలో గల టెయిల్ ల్యాంప్స్ మరియు పెద్దగా ఉన్న వితారా బ్రిజా అనే పేరుతో గల క్రోమ్ ప్లేట్‌ను తగిలించారు. దీని వలన వెనుక వైపు మరింత ఆకర్షణీయంగా ఉంది.

ఇంటీరియర్
ఇంటీరియర్ లోపల మూడు స్పోక్స్ గల స్టీరింగ్ వీల్‌ను అందించారు. దీని మీద ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ వంటి వాటిని నియంత్రించే వెసులుబాటు కలదు.

వితారా బ్రిజా కొలతలు

లభించు రంగులు
సింగల్ టోన్ రంగులు :

డ్యూయల్ టోన్ రంగులు:

బూట్ స్పేస్ మరియు టైర్ల కొలతలు
మారుతి సుజుకి తమ వితారా బ్రిజా కారులో 328 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ను అందించారు. మరియు దీనికి 215/60 ఆర్ 16 మరియు 210/60 ఆర్ 16 కొలతలు గల టైర్లను అందించారు.

మొదటిసారిగా బ్రిజాలో
మారుతి సుజుకి మొదటి సారిగా ప్రొటెక్షన్ కోసం సుజుకీ టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ ను అందించారు మరియు బాడీ బరువు తక్కువగా ఉండేందుకు ఎక్కువ టెన్సైల్ గల స్టీల్ పదార్థంతో తయారు చేశారు.

ఫీచర్లు

ఫీచర్లు

ఫీచర్లు

భద్రత ఫీచర్లు
మారుతి సుజుకి తమ వితారా బ్రిజాలోని అన్ని వేరియంట్లలో కూడా డ్రైవర్ ఎయిర్ బ్యాగును అందించారు మరియు ఆప్షనల్‌గా మిగతా వేరియంట్లలో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లను అందించారు.

అందుబాటులోకి
మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యువి ప్రస్తుతం దేశం వ్యాప్తంగా గల మారుతి సుజుకి డీలర్‌షిప్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరియు వీటికి చెందిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే వీటిని మార్చి 21, 2016 నుండి డెలివరీ చేయనున్నారు.

పోటీ
మారుతి సుజుకి వారి వితారా బ్రిజా ముఖ్యంగా రెనో వారి 2016 డస్టర్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా వారి టియువి300 వంటి వాహనాలకు పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications