2016 ఆటో ఎక్స్ పోలో వితారా బ్రిజాను ప్రదర్శించిన మారుతి సుజుకి

By Anil

దిల్లీలో నిర్వహించబడుతున్న 2016 ఆటో ఎక్స్ పో ప్రముఖ వాహన ప్రదర్శన వేడుక కన్నుల పండుగలా ప్రారంభంమైంది. అందులో భారత దేశపు అతి పెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తమ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యుని ప్రదర్శించింది.
Also Read: ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడుతున్న మరిన్ని కార్ల గురించి తెలుసుకోండి
మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో

డిజైన్

డిజైన్

మారుతి సుజుకి కార్ల సంస్థ బ్రిజా ఎస్‌యువిని విడుదల చేసేంతవరకు దీని డిజైన్ పట్ల తీవ్ర సంగ్దిత నెలకొంది. అయితే బ్రిజా ముందు వైపు ఉన్న శైలి అత్భుతం. ఇది మారుతి సుజుకి వారి నూతన డిజైన్ శైలికి అద్దం పట్టేలా ఉంది. 2014 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన ఎక్స్ఎ-ఆల్ఫా కాన్సెప్ట్ డిజైన్‌ను పోలి ఉంది.

ముందు వైపు డిజైన్

ముందు వైపు డిజైన్

వితారా బ్రిజా కారుకు ముందు వైపున ప్రొజెక్టర్ యూనిట్లను కలిగిన హెడ్ ల్యాంప్స్, క్రోమ్ పూత పూయబడిన సింగిల్ స్లాట్ గ్రిల్ దీని ముందు వైపు డిజైన్‌లో మనం గమనించవచ్చు.

 వెనుక వైపు డిజైన్

వెనుక వైపు డిజైన్

దీని వెనుక వైపున ఎస్‌యువిల వంటి సాధారణ డిజైన్ పోలి ఉంటుంది. అయితే టెయిల్ లైట్లను సగం బ్యాక్ డోర్‌లోకి జొప్పించారు, నెంబర్ ప్లేట్ పైన ఉన్న క్రోమ్ ఫినిష్ కలిగిన వితారా బ్రిజా పేరు గల బోర్డుని తగిలించారు.

 ఇంజన్

ఇంజన్

మారుతి సుజుకి వారి సరికొత్త వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి లో 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు.

 పవర్

పవర్

విజారా బ్రిజా లో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 89 బిహెచ్‌పి పవర్ @4000 ఆర్‌పిఎమ్ వద్ద మరియు 200 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ @ 1750 ఆర్‌పిఎమ్ వద్ద విడుదల చేయును.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

వితారా బ్రిజా లో మారుతి సుజుకి సియాజ్ సెడాన్ లో ఉపయోగించిన డీజల్ హైబ్రిడ్ ఇంజన్‌ను వినియోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

  • కీ లెస్ ఎంట్రీ
  • క్రూయిజ్ కంట్రోల్
  • ఆటో హెడ్ లైట్లు
  • రెయిన్ సెన్సింగ్ వైపర్లు
  • బాహ్య వైపున గల రెండు అద్దాలను పవర్ ద్వారా టర్న్ చేసుకునే సౌలభ్యం
  • ఫీచర్లు

    ఫీచర్లు

    • పుష్ బటన్ స్టార్ట్
    • రివర్స్ పార్కింగ్ కెమెరా
    • డ్యూయల్ టోన్ కలర్లు
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (ఎ/సి)
    • ఆపిల్ కార్ ప్లే కలిగి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
    •  వితారా బ్రిజాలోని భద్రత ఫీచర్లు

      వితారా బ్రిజాలోని భద్రత ఫీచర్లు

      వితారా బ్రిజాలోని అన్ని వేరియంట్లలో ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ వ్యవస్థను కలిగి ఉన్న యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కల్పించారు. మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్‌లను అందించారు.

       పోటి

      పోటి

      మారుతి సుజకి వారి ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వారి క్రెటా మరియు ఫోర్డ్ వారి ఎకో స్పోర్ట్ వాహనాలకు ప్రత్యక్ష పోటిని ఇవ్వనుంది.

       అందుబాటులోకి

      అందుబాటులోకి

      మారుతి సుజుకి ఇండియా ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయనుంది.

      2016 ఆటో ఎక్స్ పోలో మారుతి సుజుకి వితారా బ్రిజా
      • 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడుతున్న అత్యాధునికమైన కార్ల గురించి తెలుసుకోండి.

More from DriveSpark

Article Published On: Friday, February 5, 2016, 9:39 [IST]
English summary
2016 Auto Expo: Maruti Suzuki Vitara Brezza Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+