మారుతి వ్యాగన్ఆర్ ఫెలిసిటి లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు
మారుతి సుజుకి విభిన్నమైన గ్రాఫిక్స్ జోడింపుతో వ్యాగన్ ఆర్ ఫెలిసిటి లిమిటెడ్ ఎడిషన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.
దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి తమ వ్యాగన్ ఆర్ ఆధారిత ఫెలిసిటి లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. విభిన్న ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ జోడింపుతో ఎల్ఎక్స్ఐ మరియు విఎక్స్ఐ అనే రెండు వేరియంట్లో ఉన్నట్లు మారుతి తెలిపింది.

సరికొత్త వ్యాగన్ ఆర్ ఫెలిసిటి ధరలు
- ఎల్ఎక్స్ఐ ధర రూ. 4.4 లక్షలు
- విఎక్స్ఐ ధర రూ. 5.37 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- ప్రస్తుతం మారుతి మరియు హ్యుందాయ్ మోటార్స్ సంయుక్తంగా తమ ఉత్పత్తుల మీద అందిస్తున్న భారీ ఆఫర్లు మీ కోసం....

మారుతి ఈ సరికొత్త ఫెలిసిటి వేరియంట్ వ్యాగన్ ఆర్ లో డబుల్-డిఐఎన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, స్పీకర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డిస్ల్పే మరయు వాయిస్ గైడెన్స్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో కలవు.

వ్యాగన్ ఆర్ ఫెలిసిటి లిమిటెడ్ ఎడిషన్ లో పియు సీట్లు, స్టీరింగ్ కవర్, బాడీ గ్రాఫిక్స్ మరియు రియర్ స్పాయిలర్ వంటి వాటిని గుర్తించవచ్చు.

అయితే ఈ వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు మరియు ఇది పెట్రోల్, సిఎన్‌జి ఇంధన వేరియంట్లో కూడా లభిస్తోంది.

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ ఎక్జ్సిక్యుటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి మాట్లాడుతూ, దేశీయ విపణిలో వ్యాగన్ ఆర్ అత్యంత విజయవంతమైన ఉత్పత్తి మరియు గత ఐదు సంవత్సరాల నుండి వరుసగా టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు సంపాదించిందని తెలిపాడు.

ఐదేళ్ల పాటు వరుసగా అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్నందుకు వ్యాగన్ ఆర్ ను ఫెలిసిటి అనే పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసినట్లు తెలిపాడు.



Click it and Unblock the Notifications








