2016 మలిసగానికి ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

By Anil

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న కార్ల అమ్మకాలకు అసలైన పట్టు ఆటోమేటిక్ ఒకటి. చాలా మంది ఆటోమేటిక్ వేరియంట్లకు మొగ్గు చూపడం మరియు మ్యాన్యుల్‌కు వ్యతిరేకంగా ఆటోమేటిక్‌ కార్లను డ్రైవ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశీయ అతి పెద్ద ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి వారి కథనం ప్రకారం, మారుతి ఇప్పటి వరకు లక్షకు పైగా ఆటోమేటిక్ మరియు ఆటోగేర్‌షిఫ్ట్ టెక్నాలజీ ఉన్న కార్లను అమ్మేసింది.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయంగా ఆటోమేటిక్ వేరియంట్లకు ఉన్న గిరాకీని ఆలోచించుకుని మారుతి ఇప్పుడు తమ స్విఫ్ట్ ఆటోమేటిక్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

లిమిటెడ్ ఎడిషన్ మారుతి స్విఫ్ట్ ను ఆటోమేటిక్ వేరియంట్లో 2016 జూన్‌లోపు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

గత 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లో ఆటోమేటిక్ మరియు ఆటోగేర్‌షిఫ్ట్ టెక్నాలజీ గల వాహనాల అమ్మకాలు 82 శాతం వరకు పెరిగాయి.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి గడిచిన ఆర్థిక సంవత్సరంలో 54,700 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లను అమ్మింది. అందులో ఎక్కువగా సెలెరియో కార్లు ఉన్నాయి.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి తమ అన్ని కార్లలో కూడా ఆటోమేటిక్ మరియు ఆటోగేర్‌షిఫ్ట్ టెక్నాలజీల కోసం మ్యాగ్నెట్టీ మారెల్లీ సంస్థతో చేతులు కలిపింది. మరియు దేశీయంగా మొదటి సారిగా ఆటోమేటిక్‌ను పరిచయం చేసింది కూడా మారుతినే.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి తమ 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లో మాత్రమే ఆటోమేటిక్ మరియు ఆటోగేర్‌షిఫ్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

ఇందులో వినియోగించనున్న 74 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆటోమేటిక్ వేరియంట్లో మారుతి స్విఫ్ట్

మారుతి వచ్చే పండుగ సీజన్‌కల్లా తమ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిలో కూడా ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేయనుంది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల వాహనాలలో వేగాన్ని బట్టి గేర్లను మార్చుతుంటాం. హై వే రోడ్లలో తప్పిస్తే సిటి లోని ట్రాఫిక్ రోడ్ల మీద మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల కార్లలో వెళితే మాటి మాటికీ గేర్లను మార్చుతూ ఉండాలి. అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అయితే వేగాన్ని బట్టి దానంతట అదే గేర్లను మార్చుకుంటుంది.

మరిన్ని కథనాల కోసం...

ఎన్నికల ప్రచారానికి మొదటి సారిగా విమానాన్ని వినియోగించిన రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా ?

More from DriveSpark

Article Published On: Tuesday, May 17, 2016, 10:52 [IST]
English summary
Maruti Swift AMT Possible Launch In Second Half Of 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+