హ్యాచ్‌బ్యాక్ దిగ్గజం స్విఫ్ట్ డెకా గురించి 10 ప్రత్యేకతలు
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి 2005 లో మొదటి సారిగా విప్లవాత్మకమైన హ్యాచ్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశీయ హ్యాచ్‌బ్యాగ్‌ల సెగ్మెంట్లో దిగ్గజంగా ఉన్న ఈ కారు ఆప్పటి మార్కెట్లో అమ్మకాల పరంగా ఫన్ కారు అని చెప్పవచ్చు. అయితే విడుదల సమయం నుండి నేటి వరకు కూడా పనితీరు పరంగా మరియు అమ్మకాల పరంగా ఇదే ఫన్ కారుగా నిలిచింది. అయితే ఎప్పటి కప్పుడు నూతనత్వాన్ని సంతరించుకోవడానికి మారుతి ఈ స్విఫ్ట్‌ను "లిమిటెడ్ ఎడిషన్ సిఫ్ట్ డెకా"గా అందబాటులోకి తీసుకువచ్చింది.
గ్రీక్ భాషకు చెందిన డెకా పదంతో దీనిని పరిచయం చేశారు. డెకా అనగా "10" అనే అర్థం వస్తుంది. చాలా ప్రారంభం నుండే స్విఫ్ట్ అనే పదానికి ఫుట్ బాల్ ఆటకు చాలా దగ్గర సంభందం ఉండేది. అందుకోసం ఇప్పుడు మారుతి 10 మరియు ఫుట్ బాల్ ఆటను సంయక్తంగా తమ ప్రకటనల్లో చూపిస్తోంది - ఆ ప్రకటన తాలూకు వీడియో.

1. డెకా ప్రత్యేకతల్లో ఎక్ట్సీరియర్ గురించి గమనిస్తే ఇంత వరకు ఏ హ్యాచ్‌బ్యాక్ కూడా ఈ తరహా డిజైన్‌లో రాలేదని చెప్పాలి. దీనికి అదనంగా #PlayLike10 అనే కాన్సెప్ట్ అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ముందు మరియు వెనుక వైపున మారుతి వారి బంపర్లు, డ్యూయల్ టోన్ రియర్ వ్యూవ్ అవుట్ సైడ్ మిర్రర్లు మరియు కారు మొత్తం డ్యూయల్ టోన్ రంగుల్లో ఉంది.

2. అత్యంత ఆకర్షణీయమైన రంగుల్లో ఎరుపు ఒకటి. ఈ ఎరుపుకు తోడుగా తెలుగు రంగు(పియర్ల్ వైట్)తో ఈ స్విప్ట్ డెకా ఎక్ట్సీరియర్‌ను అత్యంత సుందరంగా డిజైన్ చేశారు.

3. ఇక ఇంటీరియర్ కూడా ఆకట్టుకునే విధంగా ఎరుపు మరియు తెలుపు రంగుల కాంబినేషన్‌లో ఉన్న సీటు కవర్లను ధరించింది. ప్రత్యేకంగా మరియు విభిన్నమైన ఇంటీరియర్ అనే అనుభూతిని పొందడం కోసం అన్నట్లుగా సీట్ల మీద10 అనే విధంగా ఎంబ్రాయిడరింగ్ చేశారు.

4. స్విఫ్ట్ అనగానే సౌకర్యానికి పర్యాయ పదం అలాంటి స్విఫ్ట్‌లో మరింత సౌకర్యాన్ని కల్పిస్తూ లగ్జరీ ఫీల్‌ను కలుగజేసే విధంగా ఇందులోని డ్యాష్ బోర్డ్ ను డిజైన్ చేసారు మరియు ముందు వైపున ఉన్న ప్రయాణికులకు ఆర్మ్ రెస్ట్ (ముంజేయి విశ్రాంతి) లను అందించారు.

5.ఎక్కువ ఇష్టపడే తరువాత ఫీచర్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇందులో 2-డిఐఎన్ సోనీ టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్‌ను అందించారు. దీనికి యుఎస్‌బి, ఎయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి ని కల్పించారు. మరియు వైర్ ఫ్రీ ఎకెఎ ఫస్-ఫ్రీ అడియో సిస్టమ్ అనుభూతిని పొందవచ్చు. అన్ని వైపులకు మ్యూజిక్ అందివ్వడానికి నాలుగు బిల్ట్ ఇన్ స్పీకర్లు అందించారు.

6. డ్యాష్ బోర్డ్‌ను చూసి ఇది కార్బన్ పైబర్ పదార్థమా అని ప్రశ్న మెదులుతుంది కదా ? దీని అత్యంత నాణ్యమైన ఫాక్స్ కార్బన్ ఫైబర్ పదార్థంతో డిజైన్ చేశారు. తద్వారా ఇది మరే ఇతర కార్లలోను లేని విధంగా స్పోర్టిగా కనిపిస్తోంది. డ్యాష్ బోర్డ్‌తో పాటు డోర్ హ్యాండిల్స్‌ను కూడా ఫాక్స్ కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు.

7. ఆంబియంట్ లైటింగ్ కారు ఇంటీరియర్‌ను మరింత అందంగా మారుస్తుంది. అందులోనూ మారుతి ఆ స్విఫ్ట్ డెకాలో ఎరుపు రంగులో ఉండే ఆంబియంట్ లైటింగ్‌ను అందించింది. తద్వారా రాత్రి వేళల్లో దూర ప్రాంత ప్రయాణాలకు ఈ లైటింగ్ ఎంతగానో ఉపకరిస్తుంది.

8. స్విఫ్ట్ డెకాలో ఉన్న పవర్ కథ ఏమిటి ?
పరీక్షించిన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ పవర్ ఇంజన్‌లను ఈ స్విఫ్ట్ డెకాలో అందించారు. ఇందులోని పెట్రోల్ వేరియంట్ 20.4 కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ 25.2 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయి.

9.ఇంజన్ విడుదల చేసే పవర్‌కు అనుగుణంగా ఇందులో భద్రత ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు. పార్కింగ్ కెమెరాల స్పష్టత కోసం సోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో స్పష్టమైన డిస్ల్పే కలదు.

10. అన్ని అంశాల పరంగా థ్రిల్లింగ్ గా ఉండే #PalayLike10 మారుతి స్విఫ్ట్ డెకా ధర ఎంత అని సందేహిస్తున్నారా ? పెట్రోల్ వేరియంట్ స్విప్ట్ డెకా ధర రూ. 5.94 లక్షలు మరియు స్విఫ్ట్ డెకా డీజల్ వేరియంట్ ధర రూ. 6.87 లక్షలు.

కారు ఇన్సూరెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు... పూర్తిగా వినియోగదారుల లాభదాయకమైన ఈ విధానం గురించి పూర్తి వివరాలు...

అత్యంత సరసమైన ధరకు టయోటా నుండి మరో సెడాన్


Click it and Unblock the Notifications








