నిస్సాన్ జిటి-ఆర్ రూపంలో మారుతి సుజుకి స్విఫ్ట్
దేశీయంగా మరియు అంతర్జాయ మార్కెట్లలలో మారుతి సుజుకి వారి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు మంచి ఆదరణ ఉంది, అమ్మకాల పరంగా కూడా దీనికిదే ప్రత్యేకం. ఎన్నో ఏళ్ల నుండి జపాన్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ దీనికి పై పైన మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేది. అయితే దీనికి విసుగు చెందిన ఒక వినియోగదారుడు దీనిని ఎలా మార్చేసుకున్నాడో మీరే చూడండి.

కార్ల డిజైన్‌ను మోడిఫి చేసే ప్రముఖ క్యాడ్డీ క్రూయిజ్ అనే సంస్థ దీని ముందు వైపు డిజైన్‌ను పూర్తి స్థాయిలో నిస్సాన్ జిటి-ఆర్‌ను పోలి ఉండే విధంగా మార్పు చేశారు.

ముందు వైపున స్పోర్ట్స్ కారును పోలి ఉంటూ అదేవిధంగా నిస్సాన్ జిటి-ఆర్ ను పోలి ఉండటానికి బంపర్ మరియు హెడ్ లైట్ల్స్ రెండింటిని మోడిఫై చేశారు.

వెనుక భాగంలో చూస్తే దీనికి ఏరో డైనమిక్ స్పాయిలర్‌ను అందించారు. దీని ద్వారా గాలి వలన కారు వెనుక భాగంలో క్రింది వైపుకు పడే ఒత్తిడిని తగ్గించవచ్చు.

వీరి మోడిఫికేషన్‌లో వెనుక వైపున బంపర్ మరియు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ప్రత్యేక శైలిలో డిజైన్ చేసారు. మారుతి వారు అందించిన సన్ రూఫ్‌ను తొలగించి ఈ మోడిఫైడ్ స్విప్ట్‌లో సరికొత్త సన్ రూఫ్‌ను అందించారు.

క్యాబిన్ లోపల మోడిఫికేషన్స్ గురించి పరిశీలిస్తే స్పార్కో గేర్ నాబ్ (ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేసిన గేర్ లీవర్, వీటిని ఇటలీలోని ఆటోమొబైల్స్‌లో ఎక్కువగా వినియోగిస్తారు).

స్విఫ్ట్‌లో ఉన్న సాదారణ పెడల్స్ స్థానంలో మోమో ఫుట్ పెడల్స్‌ను అందించారు.

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లను పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ కారును పోలి ఉండే విధంగా డిజైన్ చేసారు, అదే విధంగా ఇంజన్‌కు కూడా కొన్ని మార్పులు చేశారు. తద్వారా దీనిని డ్రైవ్ చేస్తున్నపుడు ఖచ్చితంగా స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేస్తున్న అనుభూతిని పొందవచ్చు.

పాత వాటికి ప్రాణం పోస్తే ఇలాగే ఉంటాయి మరి
ల్యాంబోర్గినిగా మారిన మారుతి కారు....!

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉంటాయో
నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్
ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2 (100% నవ్వు గ్యారంటీ)


Click it and Unblock the Notifications