జూన్ 2016 అమ్మకాల్లో 48 శాతం కోల్పోయిన స్విఫ్ట్

By Anil

ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే స్విఫ్ట్ కారు చెరిగిపోని ముద్రను వేసుకుంది. ప్రతి మాసంలో కూడా టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల విభాగంలో చోటు సాధించేది. అయితే జూన్ 2016 అమ్మకాలను జూన్ 2015 తో పోల్చుకుంటే సుమారుగా 48 శాతం కోల్పోయింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

సగానికి పైగా అమ్మకాలను నష్టపోయిన మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క గణాంకాలను పరిశీలించినట్లయితే గత ఏడాది జూన్ మాసంలో 17,313 స్విఫ్ట్ కార్ల అమ్మకాలు నమోదు కాగా ఈ ఏడాది జూన్ మాసంలో 9,033 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్, సరసమైన ధర, అత్యంత శక్తివంతమైన ఇంజన్, స్పోర్టివ్ డిజైన్ మరియు దేశ వ్యాప్తంగా అందుబాటులో డీలర్ షిప్‌లు వంటి ఎన్నో అంశాలు దీనిని భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిపాయి.
Also Read: మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ రివ్యూ...
మారుతి సుజుకి ఎంట్రీ లెవల్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల మీద దృష్టి సారించిన తరువాత ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు కాంపాక్ట్ ఎస్‍‌‌యువిల మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా బాలెనొ మరియు వితారా బ్రిజాలను విపణిసలోకి ప్రవేశపెట్టింది. కాని కొత్త కార్ల ప్రభావం వలన ఆల్టో, స్విప్ట్ డిజైర్, వ్యాగన్ ఆర్ మరియు సెలెరియో వంటి ఉత్పత్తుల యొక్క అమ్మకాలు నానాటికీ తగ్గిపోతూ వచ్చాయి. కాని మొత్తం అమ్మకాలు మారుతి సుజుకిని నిరాశపరచలేదు.
Also Read: 2016 జూన్ కార్ల అమ్మకాల్లో పెను మార్పులు: తారుమారైన టాప్-10 జాబితా
స్విఫ్ట్ అమ్మకాలు మారుతి సుజుకి సంస్థ యొక్క పతనానికి దారులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి తమ స్విఫ్ట్ ను 2017 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌గా 2017 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో విడుదల అయితే మారుతి అమ్మకాలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి.

Article Published On: Tuesday, July 12, 2016, 12:27 [IST]
English summary
Swift Sales Drop By 48 Percent; Is The New Car In India The Reason?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+