నూతన స్విఫ్ట్ స్పై ఫోటోలు: ఇప్పటి వరకు ఊహించని రూపంలో న్యూ స్విఫ్ట్
మారుతి సుజుకి లైనప్‌లో బాగా విజయం సాధించిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్. మారుతి దీనిని అప్‌గ్రేడెడ్ వర్షన్‌లో అభివృద్ది చేస్తోంది. అయితే సెప్టెంబర్ 29 లో జరిగే ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శితం కానున్న ఇది దాని కంటే ముందుగా రహస్యంగా పరీక్షలు నిర్వహించబడింది. అయితే ప్రస్తుతం ఉన్న డిజైన్‌కు పూర్తిగా విభిన్నంగా ఉంది ఈ నయా స్విఫ్ట్.

ప్రస్తుతం పరీక్షలకు గురైన స్విఫ్ట్‌ను పరిశీలిస్తే ఇది పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్దమైన ప్రొడక్షన్ రెడి మోడల్‌గా కనువిందు చేస్తోంది.

మారుతి సుజుకి దీనిని జర్మనీ రహదారుల మీద పరీక్షించింది. 2017 నాటికి విడుదల కానున్న ఇందులో చాలా వరకు కాస్మొటిక్ మార్పులు రానున్నాయి.

దీనికంటే ముందు పరీక్షలకు గురైన నయా స్విఫ్ట్‌కు దీనికి మధ్య చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్ మరియు ఇంటీరియర్‌కు సంభందించినవి.

దీని ముందు వైపు డిజైన్‌ను గమనించిని వారు ఇది స్విఫ్ట్ అని నమ్మలేరు. సెంట్రల్ ఎయిర్ డ్యామ్‌తో అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ కలదు. బానెట్ నుండి బంపర్ వరకు విస్తరించి ఉంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల హెడ్ ల్యాంప్స్ మరియు రౌండ్ ఫాగ్ ల్యాంప్స్ కలవు.

దీనిని సైడ్ ప్రొఫైల్ గమనించిన తరువాత ముందు నుండి వైనుక వైపునకు ఉన్న వాలు చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. అదే విధంగా పరిమాణంగా అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కొద్దిగా చిన్నగానే ఉంటాయి.

వెనుక వైపు డిజైన్‌లో చోటుచేసుకున్న మార్పులలో బాక్సీగా ఉన్న రియర్ విండ్ షీల్డ్ మరియూ బూట్ డోర్లు దర్శనం ఇస్తాయి. ఇక నెంబర్ ప్లేటు కోసం ప్రత్యేకంగా పెద్ద స్లాట్‌ను డిజైన్ చేసారు.

ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌తో పోల్చుకుంటే 2017 కు చెందిన నయా స్విఫ్ట్ తక్కువ బరువుతో స్పోర్టివ్‌గా ఉంటుంది.

బాలెనొ మరియు ఇగ్నిస్‌లను రూపొందించిన గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ మీద ఈ 2017 స్విఫ్ట్‌ను అభివృద్ది చేశారు. తద్వారా బాలెనొ మరియు ఇగ్నిస్ తరహాలోనే ఇది కూడా లైట్ వెయిట్ ఫార్ములాతో రానుంది.

సాంకేతికంగా చూస్తే ఈ నూతన స్విఫ్ట్‌లో మూడు ఇంజన్‌లు రానున్నాయి. అవి 1-లీటర్, మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ ఇంజన్. ఇది బాలెనొ ఆర్ఎస్ మరియు ఇగ్నిస్‌లలో రానుంది.

సుమారుగా 140 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ కె-సిరీస్ ఇంజన్ మరియు నాలుగు సిలిండర్ల 1.4-లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్‌తో రానుంది.

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక
125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు ఉత్తమ మైలేజ్ బైకులు


Click it and Unblock the Notifications