నూతన రికార్డులను నెలకొల్పుతున్న మారుతి సుజుకి డీలర్లు
భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మొదటి సారిగా కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి విడుదల చేసిన వితారా బ్రిజా అనూహ్యంగా ఊహించిన రీతిలో అసాధారణ బుకింగ్స్ నమోదు చేసుకుంటోంది. 2016 మార్చిలో విడుదలైన వితారా బ్రిజా మారుతి సుజుకి విజయాన్ని కొనసాగేలా ఫలితాలను సాధిస్తోంది. విడుదల సమయం నుండి సుమారుగా 95,000 లకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుని కొత్త రికార్డులు సృష్టించింది.
మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి వితారా బ్రిజాలోని ఎంట్రీ లెవల్ వేరియంట్ యొక్క ధర రూ. 6.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. మరియు పూర్తి స్థాయి ఫీచర్లతో వచ్చిన టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.68 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

వితారా బ్రిజా ఎంట్రీ లెవల్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు వరుసగా 8.32 మరియు 11.27 లక్షలుగా ఉన్నాయి.

జపాన్ ఆధారిత సంస్థ మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని ఆరు విభిన్న వేరియంట్లలో అందిస్తోంది. అవి ఎల్‌డిఐ, ఎల్‌డి(ఒ), విడిఐ, విడిఐ(ఒ), జడ్‌డిఐ, జడ్‍డిఐ ప్లస్ వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

సాంకేతికంగా మారుతి సుజుకి ఈ వితారా బ్రిజాలో 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‍బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి వారి ఉత్పత్తులు అనగానే మైలేజ్‌కు పర్యాయపదాలుగా ఉంటాయి. కాబట్టి వితారా బ్రిజా లీటర్‌కు 24.3 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇచ్చే విధంగా రూపొందించారు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, రెనో డస్టర్ మరియు మహీంద్రా వారి టియువి300 లతో గట్టి పోటీని ఎదుర్కుంటోంది.

వితారా బ్రిజాకు సంభందించి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అధికం చేశారు. అయినప్పటికీ వెయిటింగ్ పీరియడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను అలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

బాగా విజయం సాధించిన ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్లో అందుబాటులో లేదు. ఇది పెట్రోల్ ఇంజన్తో పాటు ఆటోమేటిక్ టాన్స్‌మిషన్ అందిస్తే ఈ విజయం మరింత పెద్దది అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా పెట్రోల్ ఇంజన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కోరుకునే వినియోగదారులను కూడా గ్రహించే అవకాశాం దక్కుతుంది.

నూతన శైలిలో విడుదలైన హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 యొక్క టెస్ట్ డ్రైవ్ రివ్యూ


Click it and Unblock the Notifications