మారుతి మాస్ ఎస్‌యువి వితారా బ్రిజా - ఇందులో ఉన్న లోపాలు ఏమిటి ?
మారుతి సుజుకి దేశీయ విపణిలోకి ఎటువంటి ఉత్పత్తిని తీసుకువచ్చినా అది ప్రభంజనమే. మారుతి తమ సరికొత్త వితారా బ్రిజా వాహనం ద్వారా ఇండియన్ మార్కెట్లో ఉన్న కంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మిగతా అన్ని ఉత్పత్తుల మాదిరిగానే వితారా బ్రిజా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించింది.
ప్రతి కారులోను లోపాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. కాని కొన్ని కార్ల తయారీ సంస్థలు పై పై మెరుగులు దిద్ది లోపాలను కప్పిపుచ్చుతుంటాయి. అదే విధంగా మారుతి వారి బ్రిజాలో కూడా కొన్ని లోపాలున్నాయి వాటి గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి తమ కాంపాక్ట్ ఎస్‌యువి వితారా బ్రిజాను కేవలం డీజల్ ఇంజన్‌లో మాత్రమే అందించారు. దీనికి పోటీగా ఉన్న వాహనాలు మాత్రం పెట్రోల్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

మారుతి దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందివ్వలేకపోయింది. చాలా వరకు ఎస్‌యువిలో ఇప్పటికే ఆటోమేటిక్ వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మారుతి దీనిని త్వరలో ఆటోమేటిక్ వేరియంట్లో కూడా విడుదల చేయనుంది అని సమాచారం.

ఫీచర్లను తమ వితారా బ్రిజాలోని అన్ని వేరియంట్లలో కూడా సరైన రీతిలో అందివ్వడంలో విఫలమైందని చెప్పవచ్చు. జడ్‌డిఐ మరియు జడ్‌డిఐ ప్లస్ ఈ రెండు వేరియంట్లలో మాత్రమే పూర్తి స్థాయి ఫీచర్లున్నాయి. కనీసం బాలెనొ ఎంట్రీ లెవల్ వేరియంట్లో ఉన్న ఫీచర్లను కూడా మిగతా వితారా బ్రిజాలో కల్పించలేకపోయింది.

తప్పిపోయిన ఫీచర్లు
బాలెనొలో బై-హెక్సా గోనల్ హెడ్ ల్యాంప్స్‌ను అందించారు, అవి బ్రిజాలో లేవు. అలాగే టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, లెథర్ తొడుగులు లేని స్టీరింగ్ వీల్ ఇవన్నీ బాలెనొలో కూడా ఉన్నాయి.

డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ అనేది బ్రిజాలో ఎంతో ముఖ్యమైన అంశం. కాని ఈ ఫీచర్లు టాప్ ఎండ్ వేరియంట్ అయిన జడ్‌డిఐ ప్లస్ లో మాత్రమే కలదు.

మారుతి సుజుకి వారు తమ ఎస్-క్రాస్‌లో కూడా బ్రిజాలోని ఇంజన్‌నే వినియోగించారు. ఎస్-క్రాస్‌లోని అన్ని చక్రాలు కూడా డిస్క్ బ్రేకులను కలిగి ఉన్నాయి కాని బ్రిజా మాత్రం ఈ ఫీచర్‌కు నోచుకోలేకపోయింది.

వితారా బ్రిజా యొక్క క్యాబిన్‌ను మారుతి ఇంజనీర్లు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫోర్డ్‌తో ఎకో స్పోర్ట్‌తో పోల్చుకుంటే ఇది ఎంతో బాగుంటుంది. కాని ఇందులో ఎంతో అవసరమైన లెథర్ సీట్లను అందివ్వలేకపోయారు.

బూట్ స్పేస్: ఎస్‌యువి మరియు ఎస్‌యువి తరహా అన్ని వాహనాలకు హెచ్చు స్థాయిలో బూట్ స్పేస్ ఉండాలి. దూరభార ప్రాంత ప్రయాణాలకు వినియోగించే ఎస్‌యువి వాహనాలలో బూట్ స్పేస్ అనే అంశం ఎంతో కీలకమైనది. మారుతి తమ బ్రిజాలో కేవలం 328 లీటర్ల బూట్ స్పేస్‌ను మాత్రమే కల్పించింది.

ఇదే పరిస్థితి కొనసాగితే, ఆల్టో కథ కంచికే...!!

ఇక్కడ విమానం దింపాలంటే ఆ ఎనిమిది మంది మాత్రమే అర్హులు


Click it and Unblock the Notifications