పెట్రోల్ వేరియంట్ వితారా బ్రిజా మీద మారుతి సుజుకి దృష్టి

మారుతి సుజుకి ఇదివరకే అందుబాటులోకి తెచ్చిన వితారా బ్రిజా డీజల్ వేరియంట్ కాంపాక్ట్ ఎస్‌యువి మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ బ్రిజాను పెట్రోల్ వేరియంట్లో పరిచయం చేయాలని మారుతి భావిస్తోంది.

By Anil

మారుతి సుజుకి ఈ ఏడాది కాంపాక్ట్ ఎస్‌యువిని వితారా బ్రిజా పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఇది కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం పెట్రోల్ వాహనాల మీద పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మారుతి ఈ వితారా బ్రిజాను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దమయ్యింది.

 వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్

మారుతి ఈ తమ బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి డీజల్ వేరియంట్‌ను 7.19 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం వితారా బ్రిజా మీద ఆరు నెలల వెయిటింగ్ పీరియండ్ ఉంది.

 వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్

సాంకేతికంగా పెట్రోల్ వేరియంట్ బ్రిజా 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

 వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్

ప్రస్తుతానికి వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గురించి స్పష్టమైన సమాచారం లేదు.

 వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్

సరికొత్త వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్ 2017 ప్రారంభం నాటికి విడుదలయ్యే సూచనలు ఉన్నాయి. దీని ప్రారంభం ఎక్స్ షోరూమ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 6.50 లక్షలుగా ఉండనుంది.

 వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్

ఈ పెట్రోల్ వేరియంట్ బ్రిజా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్, రెనో డస్టర్ మరియు హోండా మొబీలియో మోడళ్లలోని పెట్రోల్ వేరియంట్లకు గట్టి పోటీనివ్వనుంది.

 వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్

  • బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు
  • మార్కెట్ కు షాక్: ఆ స్కూటర్ ను మళ్లీ లాంచ్ చేయనున్న బజాజ్
  • ఆంద్రప్రదేశ్ లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్ లు ఉండవు

More from DriveSpark

Article Published On: Thursday, November 24, 2016, 15:40 [IST]
English summary
Maruti Vitara Brezza Petrol Variant Likely To Launch In 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+