1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో మారుతి సుజుకి వితారా బ్రిజా అతి త్వరలో
మారుతి సుజుకి తమ అన్ని కార్లలో కూడా ఒకే విధమైన డీజల్ ఇంజన్ ఆప్షన్‌ను అందిస్తూ వస్తోంది. అందులో కూడా అవి మంచి మైలేజ్ మరియు చక్కటి పవర్‌ను ఉత్పత్తి చేయడం మారుతి సుజుకికు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే చాలా వరకు డీజల్ ఇంజన్‌ను అందిస్తున్న సంస్థలకు అవి విడుదల చేసే కాలుష్యం పరంగా బయంపట్టుకుంది. ఈ కారణంగా చాలా వరకు సంస్థలు ఇప్పుడు పెట్రోల్ ఇంజన్‌ను తయారు చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
అయితే మారుతి సుజుకి గత వారంలో విడుదల చేసిన వితారా బ్రిజా కారులో 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించాలని నిర్ణయించింది. దీనికి చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకోగలరు.

మారుతి సుజుకి మొదటి సారిగా 1.0-లీటర్ టర్బో ఛార్జ్‌డ్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ రూపొందించింది.

దీనిని వితారా బ్రిజా మరియు బాలెనొ ఆర్‌ఎస్ వాహనాలలో అందివ్వనున్నట్లు కూడా తెలిపారు.

మారుతి సుజుకి ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకువచ్చిన అన్ని మోడల్స్‌లో కూడా 1.2-లీటర్ మరియు 1.4-లీటర్ ఇంజన్ ఆప్షన్లు ఉండేవి. ఇవి వరుసగా 83 మరియు 91 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

కాని మారుతి సుజుకి అభివృద్ది చేస్తున్న ఈ మూడవ ఇంజన్ అయిన 1.0-లీటర్ కెపాసిటి గల బూస్టర్ జెట్ ఇంజన్ దాదాపుగా 110 పవర్ మరియు 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి గత నెలలో ముగిసిన 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద 1.0-లీటర్ కెపాసిటి గల టర్బో ఛార్జ్‌డ్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ గల బాలెనొ ఆర్‌ఎస్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది.

నూతన ఇంజన్ ఆప్షన్‌లో బాలెనో ఆర్‌ఎస్ కాన్సెప్ట్ మరియు వితారా బ్రిజా 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ వేరియంటును మారుతి సుజుకి వచ్చే పండుగ సీజన్‌కల్లా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం మారుతి సుజుకి మార్కెట్లో అందుబాటులో ఉంచిన వితారా బ్రిజా కారు 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ను అందించారు.

ఈ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 88.5 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంది.

నాలుగు మీటర్లు పొడవున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 6.99 లక్షలుగా ఉంది.
- మారుతి సుజుకి వితారా బ్రిజా విడుదల మరియు ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- లక్ష దాటిన హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్
- భారీ అంచనాలతో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్
- ఈ సమ్మర్‌లో వేసవి బారినుండి మీ కారును రక్షించుకోండి



Click it and Unblock the Notifications