మారుతి సుజుకి వితారా బ్రిజా కావాలా ? అయితే 4-5 నెలలు వేచి ఉండాల్సిందే

By Anil

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి మొదటి సారిగా కాంపాక్ట్ ఎస్‌యువిని మార్చి 8, 2016 న విడుదల చేసింది. దీనికి వితారా బ్రిజా అని పేరు పెట్టింది. విడుదల సమయం నుండి నేటి వరకు భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదు అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీటని డెలివరీ ఇవ్వడానికి నాలుగు నుండి ఐదు నెలల వరకు సమయం పడుతుందని ప్రకటించింది.

మారుతి సుజుకి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బుకింగ్స్

బుకింగ్స్

మారుతి సుజుకి ఇండియన్ కస్టమర్ల నుండి ఊహించని రెస్పాన్స్‌ను పొందింది. కేవలం రెండు వారాల సమయంలోనే 25,000 బుకింగ్స్ నమోదు అయ్యాయి.

డెలివరీ

డెలివరీ

ప్రస్తుతం వినియోగదారుల వీటని డెలివరీ తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేక మోడల్స్‌ను డెలివరీ ఇవ్వడానికి కొంచెం సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

ధర పరంగా పోటి

ధర పరంగా పోటి

ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్‌ను కేవలం 6.99 లక్షల (ఎక్స్‌ షోరూమ్ ఢిల్లీ)కే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యువిల మార్కెట్లో ఉన్న టియువి300 మరియు ఎకో స్పోర్ట్‌ల కన్నా ఇది ఎంతో తక్కువ.

ఇంజన్

ఇంజన్

మారుతి సుజుకి ఈ వితారా బ్రిజా కోసం ప్రత్యేకంగా 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంది.

పవర్ మరియు టార్క్

పవర్ మరియు టార్క్

ఇందులోని ఇంజన్ కాంపాక్ట్‌ ఎస్‌యులకు అవసరమైన స్థాయిలో 89 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఏఆర్ఏఐ ప్రకారం అత్యధికంగా లీటర్‌కు 24.3 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

పెట్రోల్ ఇంజన్ ఇవ్వలేకపోయింది

పెట్రోల్ ఇంజన్ ఇవ్వలేకపోయింది

మారుతి సుజుకి ఈ వితారా బ్రిజాను కేవలం డీజల్ ఇంజన్‌లో మాత్రమే అందించింది. పెట్రోల్ ఇంజన్‌లో అందుబాటులో లేదు. అయితే బాలెనో ఆర్‌ఎస్‌ లో వినియోగిస్తున్న 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో తీసుకువస్తోంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మారుతి సుజుకి వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్ 4-5 నెలలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినియోగదారులు దీని వెయిటింగ్ పీరియడ్ తగ్గి ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతాయా అని చూస్తున్నారు. అయితే మారుతి వీటి కాల పరిమితిని తగ్గిస్తే బాగుంటుంది.

ఎక్కువ మంది చదివిన కథనాలు మీ కోసం...
  • ఖరీదైన ఆడి కారును కొనుగోలు చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ
  • 2016 సంవత్సరానికి గాను బేస్ వేరియంట్లలో ఉన్న బెస్ట్ కార్లు
  • ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా విడుదల కానున్న టాటా టియాగో

More from DriveSpark

Article Published On: Thursday, March 31, 2016, 18:34 [IST]
English summary
Maruti Suzuki Vitara Brezza Waiting Period Up To 4-5 Months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+