రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు చేసుకున్న వితారా బ్రిజా
మారుతి సుజుకి ఈ ఏడాది మార్చి నెలలో తమ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రెండు నెలల కాలంలోనే జపాన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వారి వితారా బ్రిజా కోసం సుమారుగా 55,000 ల మంది బుకింగ్ చేసుకున్నారు. ఊహించని రీతిలో నమోదు చేసుకున్న బుకింగ్స్ కారణంగా వినియోగదారులకు దీనిని అందివ్వడానికి సుమారుగా ఆరు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను ప్రకటించనున్నట్లు తెలిసింది.

మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో సియాజ్ సెడాన్, బాలెనో హ్యాచ్ బ్యాక్ మరియు వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి. మారుతి మొత్తం అమ్మకాల్లో ఈ మూడింటి వాటా సగానికి పైగా ఉంది.

వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ యొక్క ధర రూ. 6.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.68 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా వారి టియువి300 వాహనాలకు పోటీగా నిలిచింది.

ప్రస్తుతం మారుతి సుజుకి ఈ వితారా బ్రిజా వాహనాల ఉత్పత్తిని ఏడాదికి లక్ష యూనిట్లుగా పెంచినట్లు తెలిపింది. అయితే భవిష్యత్తులో వీటి ఉత్పత్తిని 1.2 లక్షల వరకు పెంచనుంది.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దీని డెలివరీల కోసం ప్రకటించిన వెయిటింగ్ పీరియడ్ ఓ రెండు నుండి మూడు నెలల వరకు తగ్గనుంది.

మారుతి సుజుకి గడిచిన 2016 ఏప్రిల్ అమ్మకాల్లో సుమారుగా 7,832 యూనిట్ల వితారా బ్రిజా అమ్మకాలు జరిపింది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎదుగుదల బాగా ఉన్న ఎస్‌యువి సెగ్మెంట్లోకి దాదాపుగా అన్ని తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను అందిస్తున్నారు.

గరిష్ట మైలేజ్ ఇవ్వగల టాప్-10 డీజల్ ఎస్‌యువి వాహనాలు


Click it and Unblock the Notifications