వితారా బ్రిజా బుకింగ్స్ :70,000, వేచి ఉండే అవధి: 9 నెలలు

By Anil

ప్రయాణికుల కార్ల ఉత్పత్తి మరియు అమ్మకాల పరంగా మొదటి స్థానంలో భారత దేశపు అతి పెద్ద సంస్థ మారుతి సుజుకి మొదటి సారిగా ఇండియన్ మార్కెట్లోకి 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక ద్వారా పరిచయం అయ్యింది. తరువాత మార్చి 8, 2016 నాడు దేశ వ్యాప్తంగా అమ్మకాలకు అందుబాటులోకి వచ్చింది.

మారుతి వారి ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌‌యువి మార్చి 8, 2016 నుండి ఇప్పటి వరకు సుమారుగా 70,000 వరకు బుకింగ్స్ జరిగాయి. వీటిని డెలివరీ ఇవ్వడానికి సుమారుగా 9 నెలల కాలపరిమతిని ప్రకటించింది. వీటి బుకింగ్స్ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి వీటి కాలపరిమితిని ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.

వితారా బ్రిజా బుకింగ్స్ :70,000, వేచి ఉండే అవధి: 9 నెలలు

మారుతి సుజుకి వారికి వితారా బ్రిజా యొక్క బుకింగ్స్ శబ్దం బాగా వినిపించినప్పటికీ, కస్టమర్లకు దీని కాలపరిమితి ఎక్కువగా ఉండటం అనేది మింగుడుపడలేని అంశం.

వితారా బ్రిజా బుకింగ్స్ :70,000, వేచి ఉండే అవధి: 9 నెలలు

ప్రస్తుతం వితారా బ్రిజాలోని టాప్ ఎండ్ వేరియంట్లు అయిన జడ్‌డిఐ(ఒ) మరియు జడ్‌డిఐ ప్లస్ వంటి వాటిని బుక్ చేసుకునే వారికి ఖచ్చితంగా 9 నెలల తరువాత డెలివరీ ఇవ్వనున్నారు. అలా కాకుండా మధ్యమ మరియు ప్రారంభ వేరియంట్లను ఎంచుకునే వారికి ఆరు నెలల కాలపరిమితి తరువాత డెలివరీ ఇవ్వనున్నారు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యువిలో నాలుగు సిలిండర్ల డిడిఐఎస్ 1.3 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ కలదు.

పవర్ మరియు టార్క్ వివరాలు

పవర్ మరియు టార్క్ వివరాలు

వితారా బ్రిజాలోని ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 88.5 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 200 ఎమ్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

మారుతి వితారా బ్రిజాలోని శక్తివంతమైన డీజల్‌ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గే‌ర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

మైలేజ్

మైలేజ్

మారుతి సుజుకి దేశీయంగా అందుబాటులోకి వస్తున్న ప్రతి ఉత్పత్తి కూడా మైలేజ్ పరంగా మిగతా ఉత్పత్తులను సునాయసంగా ఎదుర్కుంటోంది. ఏఆర్‌ఏఐ వారి ప్రకారంం వితారా బ్రిజా లీటరుకు 24.3 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తోంది.

లభించు రంగులు

లభించు రంగులు

సింగల్ టోన్ రంగులు :

  • ఆర్కిటిక్ వైట్
  • గ్రానైట్ గ్రే
  • సెరులియన్ బ్లూ
  • ప్రీమియమ్ సిల్వర్
  • బ్లేజింగ్ రెడ్
  • ఫిర్రీ ఎల్లో
  • డ్యూయల్ టోన్ రంగులు:

    డ్యూయల్ టోన్ రంగులు:

    • మిడ్ నైట్ బ్లాక్‌ మరియు బ్లేజింగ్ రెడ్
    • సెరూలిన్ బ్లూ మరియు ఆర్కిటిక్ వైట్
    • ఫిర్రీ ఎల్లో మరియు ఆర్కిటిక్ వైట్
    • మొదటిసారిగా బ్రిజాలో

      మొదటిసారిగా బ్రిజాలో

      మారుతి సుజుకి మొదటి సారిగా ప్రొటెక్షన్ కోసం సుజుకీ టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ ను అందించారు మరియు బాడీ బరువు తక్కువగా ఉండేందుకు ఎక్కువ టెన్సైల్ గల స్టీల్ పదార్థంతో తయారు చేశారు.

      ఫీచర్లు

      ఫీచర్లు

      • క్రూయిజ్ కంట్రోల్
      • ఆటో హెడ్ ల్యాంప్స్
      • రెయిన్ సెన్సింగ్ వైపర్లు
      • ఎలక్ట్రిక్ పవర్ ద్వారా బాహ్యపు అద్దాలను ఆపరేట్ చేయడం
      • రివర్స్ పార్కింగ్ కెమెరా
      • డ్యూయల్ టోన్ కలర్స్
      • ఫీచర్లు

        ఫీచర్లు

        • సెగ్మెంట్లో మొదటిసారిగా ఆపిల కార్ ప్లే కనెక్టివిటీ
        • స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా రిమోట్ కంట్రోల్
        • రెండు ఎయిర్ బ్యాగులు
        • పెద్ద టైర్లు
        • గేర్ షిఫ్ట్ ఇండికేటర్
        • భద్రత ఫీచర్లు

          భద్రత ఫీచర్లు

          మారుతి సుజుకి తమ వితారా బ్రిజాలోని అన్ని వేరియంట్లలో కూడా డ్రైవర్ ఎయిర్ బ్యాగును అందించారు మరియు ఆప్షనల్‌గా మిగతా వేరియంట్లలో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లను అందించారు.

          పోటి

          పోటి

          మారుతి సుజుకి వారి వితారా బ్రిజా ముఖ్యంగా రెనో వారి 2016 డస్టర్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా వారి టియువి300 వంటి వాహనాలకు పోటిగా నిలిచింది.

          మారుతి సుజుకి వితారా బ్రిజా ధరలు

          మారుతి సుజుకి వితారా బ్రిజా ధరలు

          • ఎల్‌డిఐ ధర రూ. 6.99 లక్షలు
          • ఎల్‌డిఐ ఆప్షనల్ ధర రూ. 7.12 లక్షలు
          • విడిఐ ధర రూ. 7.62 లక్షలు
          • విడిఐ ఆప్షనల్ ధర రూ. 7.75 లక్షలు
          • జడ్‌డిఐ ధర రూ. 8.55 లక్షలు
          • జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 9.54 లక్షలు
          • జడ్‌డిఐ ప్లస్ డ్యూయల్ టోన్ ధర రూ. 9.68 లక్షలు
          • (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి)
            మరిన్ని కథనాల కోసం...

            స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

            మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ

Article Published On: Tuesday, May 31, 2016, 12:56 [IST]
English summary
Maruti Vitara Brezza Records Over 70,000 Bookings; 9 Months Waiting Period
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+