2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు సిద్దమైన మారుతి సుజుకి వ్యాగన్ ‌ఆర్ 7-సీటర్

By Anil

మారుతి సుజుకి 2016 లో మరొక కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 7-సీటర్ వ్యాగన్ఆర్ కారును 2016 లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. అయితే మారుతి సుజుకి ఈ 7-సీటర్ వ్యాగన్ ఆర్ కారును 2013 లో జరిగిన ఇండోనేషియా మోటార్ షోలో ప్రదర్శించింది.

అంతే కాదండోయ్ మారుతి సుజుకి తమ 7-సీటర్ వ్యాగన్ఆర్ బేస్ మోడల్‌ను కొన్ని దేశాలలో అమ్మకాలకు ఉంచింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.|

ఇంజన్

ఇంజన్

మారుతి సుజుకి 7-సీటర్ వ్యాగన్ ఆర్ కారులో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌‌లు కలవు. అయితే సెలెరయో కారులోని అత్యంత శక్తివంతమైన ఇంజన్‌లను ఇందులో ఉపయోగించనుంది.

ఎయమ్‌టి

ఎయమ్‌టి

అయితే మారుతి సుజుకి సంస్థ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ 7-సీటర్ వ్యాగన్ ఆర్ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కల్పింస్తోంది.

విడుదల తేది

విడుదల తేది

మారుతి సుజకి ఈ 7-సీటర్ వ్యాగన్ ఆర్ కారును 2016 మధ్య బాగంలో విడుదల చేయనుంది. అయితే దీనికంటే ముందుగా 2016 ఢిల్లీలో జరగబోయే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది.

ప్రయోగ దశలో

ప్రయోగ దశలో

మారుతి సుజుకి ప్రస్తుతం వ్యాగన్‌ఆర్ 7-సీటర్ ఎమ్‌పివి కారును దిగుమతి చేసుకుంది. అయితే దీనిని భారతీయ రోడ్లలలో ప్రస్తుతం పరీక్షిస్తోంది. దీనిని మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఈకో మరియు ఎర్టిగా కార్ల మధ్య రేంజ్‌లో ప్రవేశపెట్టనుంది.

పోటి

పోటి

ఇది మార్కెట్లోకి విడుదల అయితే డాట్సన్ వారి గో ప్లస్ మోడల్ కారుకు పోటిగా నిలవనుంది. అయితే రెండు మోడల్స్ కూడా ఎక్స్‌టెండెడ్‌ మోడల్స్.

ధర

ధర

మారుతి సుజుకి వారు అతి త్వరలో విడుదల చేయనున్న 7-సీటర్ వ్యాగన్ ఆర్ కారు ధర సాధారణ వ్యాగన్ ఆర్ కారు ధర కన్నా 50,000 నుండి 70,000 రుపాయల వరకు ఉండవచ్చు.

మారుతి సుజుకి మరిన్ని కథనాలు
  1. ఫేస్ లిఫ్ట్ అవతారంలో రానున్న మారుతి సుజుకి ఆల్టో 800
  2. మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.
  3. 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు, వాటి వివరాలు

More from DriveSpark

Article Published On: Tuesday, January 5, 2016, 18:42 [IST]
English summary
Maruti WagonR 7-Seater Could Be Revealed At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+