దేశీయంగా ముంబాయ్‌లో మూడవ షోరూమ్‌ను ప్రారభించిన మసెరాటి
ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ మూడవ షోరూమ్‌ను ముంబాయ్ మహానగరంలో ప్రారంభించింది. దీని ప్రారంభంతో మసెరాటి దేశ వ్యాప్తంగా మూడు షోరూమ్‌లను కలగి ఉంది.

ప్రస్తుతం ముంబైలో ప్రారంభిమైన మసెరాటి గ్లోబల్ ప్లానెట్ పెటల్ గ్రూప్‌నకు చెందినది. గ్లోబల్ ప్లానెట్ పెటల్ గ్రూప్‌కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ సుఖ్‌భీర్ బాగా మాట్లాడుతూ, మసెరాటి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న అన్ని లగ్జరీ కార్లను ఈ షో రూమ్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
Also Read: భారతదేశం యొక్క మొదటి బుల్లెట్ రైలు 'బ్లూ మ్యాప్' ; తెలుసుకోవాల్సిన 10 విషయాలు
ప్రస్తుతం ఘిబ్లి, క్వాట్రో పోర్టి, గ్రాండ్ క్యాబ్రియో మరియు గ్రాండ్ టురిస్మో వంటి కార్లను దేశ వ్యాప్తంగా అందిస్తున్నారు. అయితే ఈ మధ్యనే మసెరాటి ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేసిన లగ్జరీ ఎస్‌యువి మోడల్ లేవంతే కారును కూడా ముంబాయ్ ఔట్‌లెట్ నుండి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








