మెర్సిడెస్ ఏఎమ్‌జి సి43 విడుదల ధర రూ. 74.35 లక్షలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి అత్యంత పనితీరును కనబరిచే ఏఎమ్‌జి సి43 సెడాన్ కారును విడుదల చేసింది.
జర్మనీకి చెందిన అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి ఏఎమ్‌జి సి43 పర్ఫామెన్స్ సెడాన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 74.3 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

మెర్సిడెస్ ఇండియా లైనప్‌లో అత్యంత శక్తివంతమైన ఈ ఏఎమ్‌జి సి43 లో 3.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో వి6 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా బిహెచ్‌పి పవర్ మరియు 520ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా 4-మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ గుండా నాలుగు చక్రాలకు ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ సరఫరా అవుతుంది.

ఈ అధునాతన సి43 ఏఎమ్‌జి కేవలం 4.7 సెకండ్ల కాలవ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ లగ్జరీ పర్ఫామెన్స్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

సరికొత్త పర్ఫామెన్స్ సెడాన్‌లో ఏఎమ్‌జి రైడ్ కంట్రోల్ స్పోర్ట్స్ సస్పెన్షన్ సిస్టమ్ అమర్చబడి ఉంది. ఇందులో 3-స్టేజ్ వేరిబుల్ డ్యాంపింగ్ కుదుపులు మరియు అదుర్లను విద్యుత్ నియంత్రికల ఆధారంగా అబ్జార్వ్ చేసుకుంటుంది.

డిజైన్ పరంగా ఈ మెర్సిడెస్ సి43 సరికొత్త ఏఎమ్‌జి స్పెక్ రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ కలదు, మరింత కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ముందు భాగం, 18-అంగుళాల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, సాధారణ సి-క్లాస్ కన్నా మరింత అగ్రెసివ్‌గా ఉంది.

ఏఎమ్‌జి సి43 లో వెనుక వైపు గల బంపర్‌లో ఇముడింపజేసిన డిఫ్యూసర్ మరింత ఆకర్షణీంగా ఉంది. అత్యుత్తమ పనితీరును కనబరిచే ఈ సెడాన్‌లో రెండు ఎగ్జాస్ట్ గొట్టాలున్నాయి. అదే విధంగా బూట్ లిట్ మీద చిన్న పరిమాణంలో ఉన్న రియర్ స్పాయిలర్ కూడా కలదు.

ఇంటీరియర్‌లో సరికొత్త స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ కలదు. దీని మీద మెర్సిడెస్ వారు ముంద్రించిన చిహ్నాన్ని గుర్తించగలరు. అల్యూమినియం లోహం యొక్క సొబగులతో కూడిన డ్యాష్ బోర్డ్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా స్పష్టంగా గమనించవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ 2016 లో ఈ ఏఎమ్‌జి సి43 ని 13 వ ఉత్పత్తిగా మార్కెట్లోకి విడుదల చేసింది.

- BMW కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్
- జాన్ చెంతకు చేరిన నిస్సాన్ జిటి-ఆర్ బ్లాక్ ఎడిషన్
- విమానంలో అత్యంత సురక్షితమైన చోటు ఏది ?


Click it and Unblock the Notifications








