మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి ఆవిష్కరణ

By Anil

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తమ జిఎల్‌కె ఎస్‌యువి స్థానంలో జిఎల్‌సి ఎస్‌యువిని రీప్లేస్ చేస్తూ గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. దీనికి చెందిన ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి


సాంకేతిక వివరాలు:
  • ఇంజన్: 2.0-లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్‌డ్
  • ఇంధన రకము: పెట్రోల్
  • పవర్: 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 240 బిహెచ్‌పి పవర్
  • టార్క్: 1,300 ఆర్‌పిఎమ్ వద్ద 370 ఎన్ఎమ్ టార్క్
  • మైలేజ్: లీటర్‌కు 10.2 కిలోమీటర్లు
  • గేర్ బాక్స్: 9-స్పీడ్ గేర్‌బాక్స్
  • డ్రైవ్: ఆల్ వీల్ డ్రైవ్

Also Read: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కార్ హోమ్
డిజైన్ మరియు ఫీచర్లు:
మెర్సిడెస్ బెంజ్ వారు దీనిని ఎంతో ఆకర్షణీయంగాడిజన్ చేయడంలో ఎంతో శ్రద్ద వహించారని చెప్పవచ్చు, హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను పరిశీలించినట్లయితే ఇది ఋజువు అవుతుంది. ముందు వైపున రెండు స్లాట్లు గల గ్రిల్ తో పాటు 3-పాయింట్ స్టార్ లను వీటి మద్యలో కల్పించారు. యాంగులర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే లైట్లు కలవు. దీనికి ప్రక్క వైపుల గల వీల్ ఆర్క్ మీద కూడా ఎల్‌ఇడి లైట్లను కల్పించారు. మరియు దీనికి ఉపయోగించిన బాడీ గ్రాఫిక్స్ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ నుండి సేకరించారు.

భద్రత పరంగా ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ అసిస్ట్ మరియు ఎయిర్ బ్యాగులను కల్పించారు.
Also Read: భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఆజ్యం పోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు
అందుబాటులోకి మరియు పోటి:

మెర్సిడెస్ బెంజ్ వారు ఈ జిఎల్‌సి ఎస్‌యువి కారును ఈ ఏడాది చివరికల్లా దేశీయ మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయనున్నారు. మరియు ఇది మార్కెట్లోకి విడుదల అయితే బిఎమ్‌డబ్ల్యూ వారి ఎక్స్3 మరియు ఆడి వారి క్యూ5 కార్లకు పోటిగా నిలవనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 13, 2016, 13:15 [IST]
English summary
Mercedes Showcases GLC SUV At The 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+