మెర్సిడెస్ బెంజ్ నుండి జిఎల్‌సి ఎస్‌యువి విడుదల: ప్రారంభం ధర రూ. 50.7 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నేడు ఇండియన్ మార్కెట్లోకి జిఎల్‌సి ఎస్‌యువిని విడుదల చేసింది. జిఎల్‌సి ఎస్‌యువి యొక్క ప్రారంభ ధర రూ. 50.70 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. దీనికి సంభందించి పూర్తి వివరాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది (2016) లో ఐదవ ఉత్పత్తిగా ఈ జిఎల్‌సి ఎస్‌యువిని విడుదల చేసింది. దీనిని కంట్లీట్లి బిల్ట్ యూనిట్ (పూర్తిగా నిర్మితమైన) గా అందించనుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌స్ ధర వివరాలు
- జిఎల్‌సి 220 డి 4మ్యాటిక్ ధర రూ. 50.70 లక్షలు
- జిఎల్‌సి 300 4మ్యాటిక్ ధర రూ. 5.90 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం (పెట్రోల్/డీజల్) - 50 లీటర్లు
- బూట్ స్పేస్ (పెట్రోల్/డీజల్) - 550 లీ(1600 లీ వరకు పెంచుకోవచ్చు)
- పెట్రోల్ వేరియంట్ బరువు - 1871 కిలోలు
- డీజల్ వేరియంట్ బరువు - 1954 కిలోలు
- ఏడు ఎయిర్ బ్యాగులు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం
- హిల్ డిసెంట్ కంట్రోల్ (వాలు ప్రాంతాల నుండి క్రిందకు దిగేటపుడు అదుపు కోసం) మరియు
- 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల అయింది. రెండు ఇంజన్‌లకు కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. ఇందులోని ఇంజన్‌లు విడుదల చేసే మొత్తం పవర్ ఈ 9-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలోని పెట్రోల్ ఇంజన్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలోని నాలుగు సిలిండర్లు గల 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 241 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలోని డీజల్ ఇంజన్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలోని నాలుగు సిలిండర్ల 2.1 లీటర్ సామర్థ్య ఉన్న డీజల్ ఇంజన్ 168 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం
పెట్రోల్ ఇంజన్ వేరియంట్ కేవలం 6.5 సెకండ్ల కాలంలోనే 0 నుండి100 కిమీల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 222 కిలోమీటర్లుగా ఉంది. అదే విధంగా డీజల్ ఇంజన్ వేరియంట్ కేవలం 8.3 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిమీల వేగాన్ని పుంజుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి డిజైన్
మెర్సిడెస్ బెంజ్ కుటుంబంలో అన్ని ఎస్‌యువిలు ముందు వైపు ఒకే తరహా డిజైన్‌ను కలిగి ఉంటాయి. అయితే నూతనగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు మధ్యలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ లోగో. మరియు ఎక్కు గాలిని గ్రహించే విధంగా ఫ్రంట్ గ్రిల్‌ను డిజైన్ చేశారు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువికు ఇరుపైలా మరియు రూఫ్ మీద అల్యూమినియం సొబగులు ఉన్నాయి. అంతే కాకుండా అన్ని డోర్ల మీద కూడా ఎడిషన్ 1 అనే బ్యాడ్జిని అందించారు.

ఎక్ట్సీరియర్ పరంగా ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువిలో 18 అంగుళాల 5-స్పోక్ అల్లాయ్ చక్రాలు, వెనుక వైపున ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, రెండు ఎగ్జాస్ట్ గొట్టాలు కూడా వెనుక వైపున ఉన్న బంపర్‌లో ఇమిడిపోయే విధంగా డిజైన్ చేశారు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఇంటీరియర్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి ఇంటీరియర్‌లో లెథర్ సీట్లు, ఆంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్‍గా తెరచుకుని మరియు మూసుకుపోయే ప్యానొరమిక్ సన్‌రూఫ్ ఇందులో కలవు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలోని సెంటర్ కన్సోల్ మీద ఎడిషన్ 1 బ్యాడ్జి మరియు ఈ సెంటర్ కన్సోల్ మీద మూడు జోన్ల వాతావరణ నియంత్రికలు ఉన్నాయి. సెంటర్ కన్సోల్ పై భాగంలో 7 అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు. మరియు డ్రైవర్‌కు న్యావిగేషన్ కోసం ఇందులో జర్మిన్ మ్యాప్ యాప్ కలదు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి లోని భద్రత ఫీచర్లు
భద్రత పరంగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి యూరో ఎన్‌సిఎపి వారి పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందింది. ప్రయాణికులను భద్రంగా ఉంచేందుకు ఇందులో అన్ని రకాల భద్రత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి లో

పోటీ
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యివి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆడి క్యూ 5 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 వంటి వాటికి పోటీగా నిలవనుంది.

2017 మారుతి స్విప్ట్ స్పోర్ట్‌లో కొత్త ఇంజన్ ఆప్షన్
ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే 'హోండా నవీ ' రివ్యూ


Click it and Unblock the Notifications








