మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కార్లు రీకాల్...
మెర్సిడెస్ బెంజ్ దాదాపుగా 28,452 సి300 4మ్యాటిక్ సి-క్లాస్ కార్లను రీకాల్ కు పిలిచింది. జనవరి 27, 2014 నుండి డిసెంబర్ 1, 2014 మధ్య అమెరికాలో తయారైన వాటిని రీకాల్ చేసినట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఫోటోలు:
ఈ సి-క్లాస్ కారులోని పవర్ స్టీరింగ్ అసిస్ట్ కంట్రోల్ యూనిట్ యొక్క సాఫ్ట్ వేర్ సమస్య వలన వీటిని రీకాల్ చేశారు. ఇది పాడవడం వలన తక్కువ వేగం ఉన్నపుడు స్టీరింగ్ ను ఎక్కువగా తిప్పాల్సి వస్తుంది. ఆ సమయంలో వాహనాన్ని నడుపుతున్న వారి మీద ఎక్కువ ఒత్తిడి కలిగి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే పైన చెప్పిన తారీఖుల మధ్య తయారయిన వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ జనవరి లోపు తమ వాహనాలలోని సాఫ్ట్వేర్ కు చెందిన సమస్యల గురించి మెర్సిడెస్ బెంజ్ వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
Also Read: డెట్రాయిట్ ఆటో షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్


Click it and Unblock the Notifications





























