మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ వ్యాన్ - కాన్సెప్ట్
అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ వ్యాపార వాణిజ్య వాహనాలను నిర్మిస్తోంది. అయితే మిగతా వాహనాలు ఉన్నట్లుగానే ఈ వ్యాన్లు కూడా ఉంటాయి. ఇందులో ప్రత్యేకం ఏముంది ఏప్పుడూ చూసిందే కదా అనుకునేరు. ఇంత వరకూ మీరు చూసిన వాటిలో ఇది ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే భవిష్యత్ కోసం ఈ వ్యాన్‌ను రూపొందిస్తోంది. అందుకోసం దీనికి విజన్ వ్యాన్ కాన్సెప్ట్ అనే పేరు పెట్టారు.

మెర్సిడెస్ బెంజ్ ఎప్పుటికప్పుడు నూతన ఉత్పత్తులను రూపొందిస్తూనే భవిష్యత్తు కోసం అధునాతన వాహనాలను అభివృద్ది చేస్తోంది. అందులో భాగంగా ఎఫ్105 మరియు విజన్ టోక్యో మంచి ఉదాహరణలు. వీటి మాదిరిగానే ఆకర్షణీయమైతో మెటల్ బాడీతో భవిష్యత్ తరాల డిజైన్‌లను పోలి ఉంటూ అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది.

ad"VAN"ce అనే చొరవతో ఈ భవిష్యత్ విజన్ వ్యాన్‌ను అభివృద్ది చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానమై ఉండటం, స్మార్ట్ డెలివరీ సిస్టమ్, అన్ని విధాలుగా అనుకూలీకరించే బాడీ డిజైన్ మరియు భవిష్యత్ తరలాకు అత్యంత ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ వ్యాన్‌ను డిజైన్ చేసారు.

డ్రైవర్ లేకుండా ముందుగా మనం తెలిపిన ప్రదేశాలకు ఈ వాహనాలు వెళ్లి సరుకులను డెలివరీ ఇస్తాయి. ఇందు కోసం డెలివరీ చేయాల్సిన ప్రదేశాన్ని గుర్తించడం, డెలివరీ యొక్క స్థితిని తెలియజేయడం వంటి సమాచారం గురించి దీనికి సంకేతాలు అందే కేంద్రానికి సమాచారాన్ని చేరవేసే విధంగా మెర్సిడెస్ బెంజ్ దీనిని రూపొందించింది.

జర్మనీకు చెందిన ఈ విభిన్నమైన వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తమ వ్యాపార ధోరణిని మార్చుకోవడానికి ఇలాంటి ఉత్పత్తులను పావుగా వాడుకోనుంది. అందుకోసం ఈ అధునాతమైన ఉత్పత్తులను అద్దెకు ఇవ్వడం, ఎక్కువ కాలం పాటు లీజుకు ఇవ్వడం చేయనుంది. తద్వారా ప్రత్యక్షంగా వీటి పనితీరును గమనించే ప్రజలు వీటిని ఆదరిస్తారని కంపెనీ భావిస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ విజన్ వ్యాన్‌ను అన్ని వైపులా పూర్తిగా షీట్ మెటల్ లోహంతో డిజైన్ చేసారు. అందుకోసం విస్తారంగా సిల్వర్ లోహాన్ని వినియోగించారు.

భవిష్యత్ వాహనం అని ముద్ర వేసుకోవడానికి వాహనం క్రింద, ముందు వైపుల నీలం రంగు లైటింగ్ వచ్చే విధంగా రూపొందించారు.

ఈ విజన్ కాన్సెప్ట్ వాహనం ముందు వైపున తక్కువ పరిమాణంలో ఉంటూ ఎక్కువ కాంతిని వెదజల్లే హెడ్ ల్యాంప్‌ను కలిగి ఉంది. మరియు ముందు వైపున ఉన్న ఫ్రంట్ గ్రిల్‌లో ప్రపంచ పటాన్ని అందిస్తూ మధ్యలో మెర్సిడెస్ బెంజ్ చిహ్నాన్ని అందించారు.

ఎద్దులాంటి ఆకారంలో ఉన్న ఈ వ్యాన్‌లో 75కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఎలక్ట్రిక్ మోటార్ డ్రైవ్ ద్వారా 80 నుండి 270 కిలోమీటర్ల పాటు ఇందులో ప్రయాణించవచ్చు.

ఇందులో డ్రైవర్ ఉండడు కాబట్టి దీనికి డ్రైవర్ వైపున డోర్ అందివ్వలేదు, కేవలం వెనుక వైపున స్లైడర్ డోర్ అందించారు. అది కూడా సరుకులను లోడ్ మరియు అన్ లోడ్ చేయడానికి సులభంగా ఉండేందుకు పైన మరియు క్రింద భాగంలో రెండు డోర్లను అందించారు.

ఇందులో ఉన్న విభిన్నమైన ఫీచర్లలో రూఫ్ మీద నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ డెలివరీ డ్రోన్లు కలవు. డెలివరీ సమయం డ్రైవర్ చేయాల్సిన అన్ని పనులను ఈ డ్రోన్లు దగ్గరుండి చేస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ భవిష్యత్ వ్యాన్

మెర్సిడెస్ బెంజ్ భవిష్యత్ వ్యాన్

వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్నందు వలన చాలా వరకు సంస్థలు వినియోగదారులను భారీ మోసం చేస్తున్నారు. అయితే దళారుల ద్వారా మోసపోకుండా మీ అంతట మీరే స్వతహాగా ఇన్సూరేన్స్ చేసుకునే అధునాతన విధానం మీకోసం...

- విజయ్ మాల్యా పాపాలకు పరిహారం....!!


Click it and Unblock the Notifications








