మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్ విడుదల రూ. 60 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి తమ డ్రాప్-టాప్ సి-క్లాస్ కన్వర్టిబుల్ కారును విడుదల చేసింది.

By Anil

జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి సి-క్లాస్ క్యాబ్రియోలెట్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు ప్రకటించింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

మెర్సిడెస్ బెంజ్ వారి సరికొత్త సి-క్లాస్ క్యాబ్రియోలెట్ సి300 తీరులో దేశీయంగా అందుబాటులో ఉంది. ఈ సి300 క్యాబ్రియోలెట్ లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

సి-క్లాస్ క్యాబ్రియోలెట్ లోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ సుమారుగా 241.6బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

సి-క్లాస్ క్యాబ్రియోలెట్ కేవలం 6.4 సెంకడ్ల కాల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు యాక్సిలరేటర్‌ను అలాగే పట్టి ఉంచితే గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

మెర్సిడెస్ బెంజ్ సి300 క్యాబ్రియోలెట్‌లో ఐదు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్‌లు కలవు. అవి, ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మరియు ఇండివిడ్యువల్. విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ద్వారా డ్రైవింగ్ మరింత సులభతరం మరియు సౌకర్యవంతం అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

సరికొత్త సి-క్లాస్ క్యాబ్రియోలెట్ లో చోటు చేసుకున్న మార్పులల్లా ఫ్యాబ్రిక్ రూఫ్ విభిన్న రంగుల్లో లభించడం. తమ తాజా ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ తరహాలో బ్లాక్, బ్రౌన్, రెడ్ మరియు బ్లూ వంటి రంగుల్లో లభించును.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

సి-క్లాస్ క్యాబ్రియోలెట్ ఇంటీరియర్‌లో లెథర్ అప్‌హోల్‌స్ట్రే, లెథర్ సీట్లు, లెథర్ సొబగుల డ్యాష్ బోర్డ్ డిజైన్, మరియు లెథర్ తొడుగులున్న స్టీరింగ్ వీల్ కలదు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

ఇంటీరియర్‌లోని డ్యాష్ బోర్డ్ లో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది బర్మెస్టర్ సంస్థకు చెందిన 13 స్పీకర్లకు అనుసంధానమై ఉంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

భద్రత పరంగా సి-క్లాస్ క్యాబ్రియోలెట్ లో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, పార్కింగ్ అసిస్ట్, మెర్క్స్ ప్రి-సేఫ్టీ మరియు చురుకుగా నియంత్రించే వ్యవస్థ వంటి ఫీచర్లు స్టాండర్డ్ క్యాబ్రియోలెట్ వేరియంట్లో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉండే సి-క్లాస్ క్యాబ్రియోలెట్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును. అవి, పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, డెసిగ్నో హ్యాసింత్ రెడ్, మరియు బ్రిలియంట్ బ్లూ వంటి రంగులు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్

  • ఎస్‌యువిని కొంటున్నారా ? వీటి విడుదలకు కాస్త ఆగండి..!!
  • 745 సీసీ కెపాసిటి గల ఇంజన్‌తో హోండా వారి ఎక్స్-ఏడివి స్కూటర్
  • సరికొత్త టయోటా ఫార్చ్యూనర్ విడుదల: ధర రూ. 25.92 లక్షలు

More from DriveSpark

Article Published On: Wednesday, November 9, 2016, 18:41 [IST]
English summary
Read In Telugu: Mercedes C-Class Cabriolet Launched In India For Rs. 60 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+