సాయుధ రక్షిత మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 గార్జ్ భారత్‌లోకి ఎంట్రీ

By Anil

మెర్సిడెస్ దేశీయ మార్కెట్లోకి సాయుధ రక్షిత మేబ్యాక్ ఎస్600 గార్డు కారును ప్రవేశ పెట్టింది. దేశంలో వీటి అవసరం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిందేమో మెర్సిడెస్ బెంజ్ అందుకోసమే కాబోలు అత్యంత ఖరీదైన ఈ రక్షిత కారును ప్రవేశ పెట్టింది. దీని ధర దాదాపుగా రూ. 10.5 కోట్లు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ) గా విడుదల చేసింది.

రక్షణ కవచంలా పని చేసే ఈ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 గార్డ్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

ప్యాసింజర్ కార్లలో భద్రత పరంగా విఆర్10 ప్రొటెక్షన్ లెవల్ రేటింగ్ పొందిన మొదటి కారు ఈ మేబ్యాక్ ఎస్600 గార్డ్. బాంబు ప్రేలుడు సమయంలో కాపాడే ఇఆర్‌వి 2010 ఎక్స్‌ప్లోజన్ రెసిస్టాన్స్ వెహికల్ సర్టిఫికేషన్‌ పొందింది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

దీనికి వచ్చిన సర్టిఫికేషన్స్ ప్రకారం కారు ఎక్ట్సీరియర్ ప్యానెల్ మరియు విండోలు వంటివి తుపాకులు, ఆటోమేటిక్ రైఫిల్స్ మరియు స్నిపర్ రైఫిల్స్ అలాగే రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రెనేడ్స్ (ఆర్‌పిజి) వంటి వాటి నుండి జరిగే దాడుల నుండి తట్టుకుంటాయి.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

దాడుల నుండి ప్రయాణికులకు ఎటువంటి హాని జరగకుండా కారు బాడీ బాహ్య లేయర్‌కు మరియు బాడీ ఫ్రేమ్‌‌లకు మధ్య ప్రత్యేకమైన స్టీల్ పదార్థంతో తయారు చేసిన మెటీరియల్‌ను కల్పించారు. తద్వారా కాల్పుల నుండి ఇది రక్షిస్తుంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

పాలీ కార్బోనేట్ అనే పదార్థంతో కారు అద్దాల మీద ప్రత్యేకమైన పూత పూయబడి ఉంటుంది. తద్వరా అద్దాల మీద నుండి జరిగే దాడులను ఇది నిరోధిస్తుంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

మేబ్యాక్‌లోని అన్ని చక్రాలకు కూడా మిచ్చేలియన్ వారి స్టీల్ రింగులతో తయారు చేసిన చక్రాలను అందించారు. ఇవి ప్రేలుడులను కూడా తట్టుకుంటాయి మరియు స్కిడ్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం ఉండవు. అంత్ కాకుండా టైరులో గాలి లేనపుడు కూడా ఇది 29 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

స్టీరింగ్ మరియు ఆక్సిల్స్ ‌ను శక్తివంతంగా, ధృడంగా డిజైన్ చేశారు.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

కారు అడుగు భాగాన యుద్దంలో సంభవించే పేలుళ్లను తట్టుకునే విధంగా ప్రత్యేతకమై యుద్ద ప్లేట్లను కారు అడుగు భాగంలో అమర్చారు.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

ఇంధన ట్యాంకు యుద్దంలో ఉపయోగించేది కానప్పటికీ దీని ఇంధన ట్యాంకును సెల్ఫ్ హీలింగ్ పదార్థంతో లోపలి వైపును రూపొందించారు. ఒక వేళ కాల్పుల్లో ఇంధన ట్యాంకుకు రంధ్రాలు పడితే ఈ పదార్థం వాటిని మూసి వేస్తుంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

మీరు కారులో ఉన్నప్పుడు ప్రమాదకరమైన వాయువులు లోనికి విడుదల అయితే మీరు తాజా గాలిని లోనికి పంపింగ్ చేసే విధమైన సౌకర్యాన్ని ఇందులో కల్పించారు. దీని వలన తాజా గాలి విష తుల్యమైన గాలిని బయటకు నెట్టేస్తుంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

ఈ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 గార్డ్ కారులో అత్యంత శక్తివంతమైన 6.0-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి12 ఇంజన్ కలదు.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

ఈ శక్తివంతమైన ఇంజన్ 523 బిహెచ్‌పి పవర్ మరియు 830 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 గార్డ్ కారు బరువు దాదాపుగా 4.7 టన్నులు ఉన్నట్లు తెలిసింది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

ఇది కేవలం 7.9 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లుగా ఉంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ వారి మేబ్యాక్ ఎస్600 గార్డ్ కారు ఆడి వారి ఎ8 ఎల్ సెక్యురిటీ కారుకు గట్టి పోటిగా నిలవనుంది.

మే బ్యాక్ ఎస్600 గార్డ్‌ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్
  • ఏకే-47 మెషీన్ గన్‌తో కాల్చినా కూడా చెక్కుచెదరదు: ఆడి ఎ8 ఎల్

Article Published On: Tuesday, March 8, 2016, 16:06 [IST]
English summary
Armoured Mercedes Maybach S600 Guard Enters India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+