రూ. 2.25 కోట్ల ప్రారంభ ధరతో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ విడుదల
మెర్సిడెస్ బెంజ్ తమ ఫ్లాగ్‌షిప్ కన్వర్టిబుల్ వేరియంట్‌ను ఎస్500 క్యాబ్రియోలెట్ రూపంలో దేశీయ లగ్జరీ సెగ్మంట్లోకి విడుదల చేసింది.
జర్మనీ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విపణిలో ఉన్న లగ్జరీ కార్ల సెగ్మెంట్లోకి తమ ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ కారును ప్రవేశపెట్టింది. ఎస్-క్యాబ్రియోలెట్ ప్రారంభ ధర రూ. 2.25 కోట్లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు ప్రకటించింది. ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్‌ను దేశీయంగా ఎస్500 తీరులో విడుదల చేసింది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఉత్పత్తులను 1971 నుండి విడుదల చేస్తూ వచ్చింది. అయితే ఈ ఎస్-క్రాస్ క్యాబ్రియోలెట్ ఎస్-క్లాస్ శ్రేణిలో మొదటి తరం ఉత్పత్తిగా విడుదలైంది.

ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ ఎస్500 లో 4.7-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 442బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ కేవలం 4.6 సెకండ్ల కాల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

ఎస్-క్లాస్ శ్రేణిలో మునుపటి ఉత్పత్తి యొక్క అవే డిజైన్ లక్షణాలతో రూపొందించబడింది. దీని రూఫ్ ను మూడు లేయర్లతో తయారు చేయబడింది. మరియు ఇది బ్లాక్, బ్రౌన్స బ్లూ మరియు రెడ్ అనే నాలుగు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది.

ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ యొక్క రూఫ్ టాప్ కేవలం 17 సెకండ్లలో విచ్చుకుంటుంది మరియు గంటకు 50 కిలోమీటర్ల వేగం వద్ద ఉన్నపుడు క్లోజ్ అవుతుంది.

రెండవ తరం ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్ ఇంటీరియర్ లెథర్, వుడ్ మరియు అల్ల్యూమినియం పదార్థాలతో డిజైన్ చేయబడింది. ఆరు విభిన్న అప్‌హోల్‌స్ట్రే రంగులతో పాటు తొమ్మిది విభిన్న ఇంటీరియర్ రంగులతో ఇది లభించును.

24 ఆంప్లిఫయర్ ఛానెల్స్ ద్వారా 1,520 వాట్స్ సామర్థ్యం ఉన్న 23 స్పీకర్లు గల బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్‌లో ప్రయాణికుల భద్రత కోసం, మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీలో కోణం గల ఆటోమేటిక్ కార్ పార్కింగ్, నైట్ వ్యూవ్ అసిస్ట్ సిస్టమ్, మెర్స్క్ ప్రి సేఫ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోని లగ్జరీ కార్ల సెగ్మెంట్లో ఉన్న బెంట్లీ కాంటినెన్షియల్ జిటిసి కు గట్టి పోటీగా నిలవనుంది.

- ఎస్‌యువిని కొంటున్నారా ? వీటి విడుదలకు కాస్త ఆగండి..!!
- 745 సీసీ కెపాసిటి గల ఇంజన్‌తో హోండా వారి ఎక్స్-ఏడివి స్కూటర్
- మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్ విడుదల రూ. 60 లక్షలు


Click it and Unblock the Notifications








