ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి టాప్ లెస్‌ను విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నేడు ఇండియన్ మార్కెట్లోకి తమ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి టాప్ లెస్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 77.5 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ప్రకటించింది.
మెర్సిడెస్ బెంజ్ ఈ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి టాప్ లెస్ రోడ్‌స్టర్‌ను గత ఏడాది డిసెంబర్‌లో అధికారికంగా ప్రదర్శించారు. తరువాత 2016 డెట్రాయిట్ ఆటో షో లో ప్రదర్శించారు. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మెర్సిడెస్ బెంజ్ వారి లైనప్‌లో ఉన్న ఎస్‌ఎల్‌కె క్లాస్ రోడ్‌స్టర్ స్థానాన్ని ఈ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి రోడ్‌స్టర్ భర్తీ చేయనుంది.

శక్తివంతమైన ఈ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి రోడ్‌స్టర్ టాప్ లెస్‌లో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న బిఐ-టుర్బో వి6 ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 362బిహెచ్‌పి పవర్ మరియు 520ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్ విడుదల చేసే మొత్తం శక్తి మరియు పవర్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి రోడ్‌స్టర్ కేవలం 4.7 సెకండ్ల కాల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

మెర్సిడెస్ బెండ్ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జి ఫ్రంట్ డిజైన్ గమనిస్తే యాంగులర్ హెడ్ ల్యాంప్స్ మరియు క్రోమ్ సింగల్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్, దీనికి మధ్యలో ముందు వైపునకు ఉబ్బినట్లు ఉంటే త్రీ పాయింటెడ్ స్టార్ కలదు.

ఎక్కువ గాలిని గ్రహించే విధంగా డిజైన చేయబడిన క్రోమ్ ఇన్‌సర్ట్స్ ఉన్నటువంటి లార్జ్ ఎయిర్ ఇంటేకర్ కలదు. ఇది ముందు వైపున మధ్యలో నుండి క్రింద గల బంపర్‌తో అనుసంధానం చేయబడి ఉంది.

వెనుక వైపున టెయి్ల్ ల్యాంప్స్ వెడల్పుగా బూట్ డోర్ మీద వరకు డిజైన్ చేయబడి ఉన్నాయి. రెండు ఎగ్జాస్ట్ పైపులను అదించారు.

మెర్సిడెస్ బెంజ్ ఈ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జిలో టాప్ లెస్ రూఫ్ ను అందించింది. పై భాగాన అందించిన మెటల్ ఫోల్డింగ్ రూఫ్ టాప్‌ను కలదు, దీనిని మ్యాన్యువల్ ఆపరేట్ చేయవచ్చు.

ఈ కన్వర్టిబుల్ రూఫ్ టాప్‌ను కారు వేగం గంటకు 40 కిలోమీటర్ల వేగం ఉన్నపుడు కూడా ఆపరేట్ చేయవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌సి 43 ఏఎమ్‌జిలో 4-అంగుళాల తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి వాటిని సపోర్ట్ చేస్తుంది.

డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లకు లెథర్ తొడుగులు కల్పించారు. మరియు డ్రైవర్‌కు స్పోర్టీనెస్‌ను పెంచడానికి రెండ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా తొడుగులు కుట్టారు.

80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక అనూహ్యంగా ఒడ్డుకు చేరిన వైనం
25 నూతన ఫీచర్లతో వరల్డ్ ఎడిషన్ లాజీని విడుదల చేసిన రెనో


Click it and Unblock the Notifications








