భారత్ నుండి వాహనాలు అతిగా దిగుమతి చేసుకుంటున్న దేశాలు
ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆటోమొబైల్ ఉత్పత్తులు దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్‌ను పొందుతున్నాయి. అవును గడిచిన రెండు నెలల యొక్క వాహనాల ఎగుమతుల వివరాలు ఆరా తీస్తే కార్ల ఎగుమతులు బాగా పెరిగాయి.

ఇండియా నుండి కార్లను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న వాటిలో మెక్సికో, నేపాల్ మరియు ఇంగ్లాండు దేశాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇండియా ఎగుమతి చేస్తున్న ఆటోమొబైల్ ఉత్పత్తుల్లో కార్లు, టూ వీలర్లు, త్రీ వీలర్లు మరియు వాహన రంగానికి చెందిన ఉత్పత్తులు ఉన్నాయి.

ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆటోమొబైల్ ఉత్పత్తుల యొక్క ఎగుమతి ఏప్రిల్ నెలలో నాలుగు శాతం పెరిగింది. అవే ఉత్పత్తులు జూలైలో 5.82 శాతం పడిపోయింది.

ఇండియా నుండి జరిగిన మొత్తం ఆటోమొబైల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో మెక్సికో నుండి 501 మిలియన్ డాలర్లు, నేపాల్ నుండి 157మిలియన్ డాలర్లు మరియు ఇంగ్లాండ్ నుండి 130 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.

ఏప్రిల్-జూలై నెలలో మెక్సికోకు జరిగిన ఎగుమతుల్లో 110 శాతం వృద్ది, అదే విధంగా నేపాల్‌కు జరిగిన ఎగుమతుల్లో 122 శాతం వృద్ది మరియు ఇంగ్లాండుకు జరిగిన ఎగుమతుల్లో 22 శాతం వృద్ది నమోదైంది.

- సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు ఇవే...!!


Click it and Unblock the Notifications








