ఎమ్‌జి గ్రూప్ నుండి నూతన శ్రేణి బస్సులు విడుదల
గడిచిన 20 ఏళ్ల కాలంలో సుమారుగా 1,00,000 బస్సులను ఉత్పత్తి చేసిన సందర్బంగా ఎమ్‌జి గ్రూప్ కొలంబస్ టార్మాక్ అనే బస్సులను బస్ వరల్డ్ 2016 వేదిక మీద ప్రదర్శించింది.
భారత దేశపు అతి పెద్ద బస్సుల తయారీ కంపెనీల్లో ఒకటి ఎమ్‌జి గ్రూప్ నేడు (నవంబర్ 10, 2016) బెంగళూరులో జరిగిన బస్ వరల్డ్ 2016 షో మీద విభిన్న అవసరాలకు ఉపయోగపడే మొదటి బస్సును కొలంబస్ పేరుతో విడుదల చేసింది.

ఎమ్‌జి గ్రూప్ గడిచిన 20 ఏళ్ల కాలంలో సుమారుగా 1,00,000 లక్ష బస్సులను ఉత్పత్తి చేసినందుకు గుర్తుగా బస్ వరల్డ్ 2016 వేదిక మీద కొలంబస్ టార్మాక్ బస్సును విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఎమ్‌జి గ్రూ ఇండియాలోకి మమ్మూత్ లగ్జరీ కోచ్ బస్సును కూడా విడుదల చేసింది.

ఈ బస్సును ముఖ్యంగా విమానాశ్రంలో విమానల వద్ద నుండి ప్రయాణికులను టెర్మనల్ వద్దకు తరలించడానికి ఈ కొలంబస్ టార్మాక్ బస్సును అభివృద్ది చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లోకి దీనిని ప్రవేశపెట్టనుంది ఎమ్‌జి గ్రూప్.

12-మీటర్లు పొడవున్న ఈ కొలంబస్ బస్సులో సుమారుగా 70 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇందులో ఫ్లోర్ గ్రౌండ్ నుండి కేవలం 290మిల్లీమీటర్ల ఎత్తులో ఉండటం వలన బస్సు బాడీ అంతర్గత ఎత్తు ఎక్కువగా ఉంది.

ప్రయాణికులు వేగంగా దిగడానికి మరియు ఎక్కడానికి నాలుగు వైపులా నాలుగు డోర్లను అందించారు.

ఎమ్‌జి గ్రూప్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన మమ్మూత్ బస్సును కూడా దేశీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని విడుదల చేసింది. దీనిని బస్ వరల్డ్ 2016 వేదికగా ప్రదర్శించింది. గతంలో ముంబాయ్‌లో జరిగిన బస్ వరల్డ్ 2015 లో దీనిని ప్రదర్శించారు.

మమ్మూత్ బస్సు 60 నుండి 65 లక్షల ధరల శ్రేణితో ఆరు విభిన్న వేరియంట్లలో ఇండియన్ మార్కెట్లో లభ్యం కానుంది.

జర్మనీకి చెందిన మ్యాన్ (MAN) సంస్థకు చెందిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యాన్ ఛాసిస్ మీద ఎమ్‌జి గ్రూప్ తమ మమ్మూత్ బస్సులను నిర్మించింది. వీటిని ముఖ్యంగా భారతీయ రహదారులను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అభివృద్ది చేసింది.

మమ్మూత్ బస్సులో ఎనిమిది అత్యవసర ద్వారాల (నిష్ర్కమణల) తో పాటు నో షార్ప్ కార్నర్, ప్రతి ప్రయాణికుడికి సీట్ బెల్ట్ తో పాటు ప్రపంచ ప్రప్రథమ ఫీచర్లను ఇందులో పరిచయం చేసి గరిష్ట భద్రతతో నిర్మించారు.

- డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
- హ్యుందాయ్ నుండి క్రెటా ఆధారిత పికప్ ట్రక్
- టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్
- హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ తొలి పరిచయం
- డ్యూక్ కాదు రాకెట్



Click it and Unblock the Notifications








